Breaking News

Mahakumbh: వామ్మో.. ఈ రైళ్లు ఇంతలేటా.. ఇక కుంభమేళాకు వెళ్లినట్లే!

Published on Sun, 02/23/2025 - 10:28

యూపీలో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela) మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. దీంతో బీహార్‌ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వెళ్లాలనుకుంటున్న భక్తులు పలు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పట్నా జంక్షన్‌తోపాటు బీహార్‌లోని పలు రైల్వేస్టేషన్‌లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే రైళ్లలోకి ఎలాగైనా ఎక్కాలని పలువురు ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని నిలువరించడం రైల్వే పోలీసులకు కష్టంగా మారింది. కాగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రైల్వేశాఖ పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైళ్లు ఊహకందనంత లేటుగా నడుస్తున్నాయి.

బీహార్‌(Bihar)లోని పట్నా మీదుగా 10 రైళ్లు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ చాలా ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి పట్నా వచ్చే ప్రత్యేక రైలు (23320) ఏకంగా 37 గంటలు లేటుగా గమ్యస్థానానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 12:30కు ప్రయాగ్‌రాజ్‌ నుంచి బయలుదేరిన ఈ రైలు శనివారం రాత్రి 10:18కి పట్నా జంక్షన్‌ చేరుకుంది. ఇదేవిధంగా సిక్కిం ఎక్స్‌ప్రెస్‌ కూడా శనివారం 20 గంటలు లేటుగా పట్నా చేరుకుంది. అనన్‌సోల్‌ మహాకుంభ్‌ రైలు 9 గంటలు ఆలస్యంగా నడిచింది. కామాఖ్య నుంచి బయలుదేరిన  కుంభమేళా స్పెషల్‌ రైలు నాలుగు గంటలు లేటుగా గమ్యస్ణానానికి చేరుకుంది. 

ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్‌ ఆస్పత్రికి శంకుస్థాపన

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి