Breaking News

ఒడిశా రైలు ‍ప్రమాదం: పశ్చిమ బెంగాల్‌ యువకుని మృతదేహం బీహార్‌కు..

Published on Thu, 06/08/2023 - 07:32

ఒడిశాలోని బాలాసోర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఇక్కడ ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుని, వందలాదిమంది మృతి చెందారు. ఈ నేపధ్యంలో పలు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. పలువురు అనాథలుగా మారారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన కుమారుని మృతదేహం తీసుకువచ్చేందుకు ఒడిశా వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వ్యక్తి తన కుమారుని మృతదేహం మాయమయ్యిందని ఆరోపిస్తున్నాడు.

తన కుమారుని మృతదేహాన్ని ఎవరో తమవారిదేనని చెప్పడంతో అధికారులు ఆ మృతదేహాన్ని బీహార్‌ తరలించారన్నారు. శివనాథ్‌ కుమారుడు విపుల్‌ రాయ్‌ ఒడిశా రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో 288 మంది మృత్యువాతపడగా, వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు. శివనాథ్‌ మాట్లాడుతూ తన కుమారుడు పశ్చిమ బెంగాల్‌లోని తమ ఇంటికి వస్తుండగా, ఈ రైలు ప్రమాదంలో బలయ్యాడని తెలిపారు.

ప్రయాణ సమయంలో తన కుమారుడు తల్లితో.. కొద్దిసేపట్లో హౌరా వస్తున్నానని చెప్పాడన్నారు. అయితే ఇప్పుడు అతను తరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్నారు. టీవీలో కుమారుని మృతదేహాన్ని గుర్తించి, దానిని తీసుకువెళ్లేందుకు భువనేశ్వర్‌ వచ్చానని తెలిపారు. కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ మెడికల్‌ సైన్సెస​్‌లో తన కుమారుని మృతదేహం ఉందని తెలిసి అక్కడకు వెళ్లగా, అక్కడి హెల్ప్‌ డెస్క్‌ బృందం తన కుమారుని మృతదేహం వేరెవరో తమవారిదేనని చెప్పడంతో వారితో పాటు బీహార్‌ పంపించామన్నారు.

తన పరిస్థితి గురించి అధికారులకు చెప్పగా ఆ మృతదేహానికి డీఎన్‌ఏ టెస్టు నిర్వహించి, ఎవరిదో తెలుసుకుని రిపోర్టు అందజేస్తామని, దీనికి ఏడు రోజులు పడుతుందని తెలిపారన్నారు. తాను టీవీలో కుమారుని మృతదేహం చూడగానే వెంటనే ఇక్కడకు వచ్చానని, ఇంతలోనే మృతదేహం ఇలా మాయం అవుతుందని అనుకోలేదన్నారు. 

చదవండి: బాడీ నంబరు 151, 156, 174..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)