Breaking News

పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్‌- పూణె స్పెషల్‌ రైలు

Published on Sun, 09/22/2024 - 07:21

ముజఫర్‌పూర్‌: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముజఫర్‌పూర్- పూణే ప్రత్యేక రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు.

ప్రమాదం కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ప్రత్యేక రైలు (05389) ముజఫర్‌పూర్ నుంచి పూణెకు వెళ్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంజిన్‌ను తిరిగి ట్రాక్‌పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంజిన్ సెట్టింగ్ కోసం వెళుతుండగా ఇంజిన్‌కున్న మూడు జతల ఫ్లైవీల్స్ పట్టాలు తప్పాయని తెలుస్తోంది.

ఈ ప్రమాదానికి ముందు ఢిల్లీ- మధుర మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాజాగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు ఆగ్రాలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి ప్రశస్తి శ్రీవాస్తవ తెలిపారు.

ఈ రైలు పట్టాలు తప్పిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు చీఫ్ పీఆర్వో ఎన్‌సీఆర్ శశికాంత్ త్రిపాఠి తెలిపారు. ఈ రైలు పట్టాలు తప్పడంతో మూడు రైల్వే లైన్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని ఆగ్రా డివిజన్‌ ​​డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ తేజ్‌ ప్రకాశ్‌ అగర్వాల్‌ విలేకరులకు తెలిపారు. సూరత్‌గఢ్ పవర్ ప్లాంట్ కోసం బొగ్గును తీసుకువెళుతున్న గూడ్సు రైలులోని ఇరవై ఐదు కోచ్‌లు బృందావన్ యార్డ్ తర్వాత పట్టాలు తప్పాయని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అగర్వాల్ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: న్యూజిలాండ్‌ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)