Breaking News

శవాల కుప్పలోంచి కుమారుని శరీరాన్ని బయటకు లాగి...

Published on Wed, 06/07/2023 - 11:36

ఒడిశా రైలు ప్రమాదం అనంతరం ఇప్పుడు బాధితుల హృదయ విదారక గాథలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవకే చెందిన ఒక కథ అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాతో చెబుతున్నప్పుడు ఆ బాధితుడు ఎంతో ఆవేదనతో కన్నీరు పెట్టుకున్నాడు. రైలు ప్రమాదం అనంతరం తన కుమారుడు స్పృహ తప్పిపోయాడని, రెస్క్యూ సిబ్బంది.. తన కుమారుడు మృతి చెందాడని భావించి, కొన్ని వందల మృతదేహాల మధ్య పడేశారని తెలిపారు.

తాను సంఘటనా స్థలానికి వెళ్లి తన కుమారుడిని వెదుకుతున్నప్పుడు అతను మృతదేహాల మధ్య సజీవంగా కనిపించాడన్నారు. బాధితుడు హెలారామ్‌ మాట్లాడుతూ తనకు బాలాసోర్‌లో రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే  వెంటనే 230 కిలోమీటర్ల దూరంలోని ప్రమాద స్థలానికి చేరుకున్నానని, తన కుమారుని కోసం వెదకడం ప్రారంభించానని తెలిపారు. ఈ నేపధ్యంలోనే తాను మృతదేహాలు ఉంచిన శవాగారానికి వెళ్లానని  అన్నారు. అక్కడ వందలాది మృతదేహాల మధ్య తన కుమారుడు సజీవంగా కనిపించాడన్నారు.

దీంతో తన ​​కుమారుని శరీరాన్ని తానే ఆ మృతదేహాల మధ్య నుంచి బయటకు లాగి, ఆసుపత్రికి తీసుకువెళ్లానని తెలిపారు. తన కుమారుని చేతికి గాయమయ్యిందని పేర్కొన్నారు.  కాగా రైలు ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు తనకు ఫోన్‌ చేసి, గాయాలపాలయ్యానని తెలిపాడన్నారు. వెంటనే తాను సంఘటనా స్థలానికి చేరుకున్నానని హేలారామ్‌ పేర్కొన్నారు. తరువాత మృతదేహాలను ఉంచిన బహనాగా పాఠశాలలోని శవాగారానికి వెళ్లి, కుమారుని కోసం వెదికానన్నారు. ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం(జూన్‌ 2) నాడు జరిగిన రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు.1200 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 

చదవండి: మృతదేహాలలో నుంచి ఒక చేయి అతనిని పట్టుకోగానే...

Videos

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)