Breaking News

షాకిచ్చిన ఓటర్లు.. మృతి చెందిన అభ్యర్థికి తిరుగులేని విజయం.. కారణం ఇదే!

Published on Wed, 05/17/2023 - 08:37

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మరణించిన స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుని అందరికీ షాకిచ్చారు ఆ ప్రాంత ఓటర్లు. ప్రజల పట్ల అభ్యర్థి ప్రవర్తనే ఆమెను ఎన్నుకునేలా ప్రజలను ప్రేరేపించిందని, అందుకే ఆమెను తిరిగులేని విజయాన్ని అందించారని స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హసన్‌పూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆసియా ఏప్రిల్ 16న 7వ వార్డు అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేసింది. 

అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఏప్రిల్ 20న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం ఆసియా మృతి చెందినప్పటికీ ఆమెకే పట్టం కట్టారు. ఈ విజయంపై ఆసియా భాగస్వామి ముంతజీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ' ఆమె గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన వల్లనే ప్రజల మనసు గెలుచుకోగలిగింది. ఆమెపై ప్రజల్లో ఉన్న ప్రేమ వల్లే ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. 

‘ఆసియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే నామినేషన్ వేసిన కొన్ని రోజులకే ఆమె మృతి చెందింది. ఎన్నికల ఫలితాల్లో ఆమె గెలుపొందింది. దీంతో మళ్లీ ఆ వార్డులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని’ హసన్‌పూర్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ తెలిపారు.

చదవండి: కాబోయే భర్తను అరెస్ట్‌ చేసిన లేడీ సింగం గుర్తుందా?.. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూత

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)