Breaking News

సొరంగంలో విషాదం.. పలువురు కార్మికులు గల్లంతు!

Published on Tue, 07/21/2026 - 07:49

సమర్డోంగ్: సిక్కింలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సౌత్ సిక్కిం జిల్లాలోని సమర్డోంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఎన్హెచ్‌పీసీ తీస్తా స్టేజ్-VI జలవిద్యుత్ ప్రాజెక్ట్ సొరంగంలో మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో భారీగా కొండచరియలు విరిగిపడి సొరంగం దెబ్బతిన్నది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, సుమారు 27 మంది వరకు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఘటన జరిగిన వెంటనే బాధితులను రంగపో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. అయితే, సొరంగంలోకి విషపూరిత వాయువులు వ్యాపించడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పేలుడు ధాటికి సొరంగం ఒక భాగం పూర్తిగా ధ్వంసమై దారి మూసుకుపోయింది. నామ్చి జిల్లా కలెక్టర్ అనూపా తామ్లింగ్ మాట్లాడుతూ, సహాయక చర్యల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు.

రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రక్షణ పరికరాలు లేకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, ప్రమాదకర పరిస్థితుల కారణంగా వెనుదిరగాల్సి వచ్చింది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: టీవీల ముందు జనసంద్రం.. రోడ్లపై నిశ్శబ్దం!

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)