Breaking News

‘పొట్టకూటి కోసం వెళ్తే ప్రాణాలే తీశారు’

Published on Sun, 08/02/2026 - 10:20

బిలాయిగఢ్: జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబ పోషణ కోసం కశ్మీర్‌కు వెళ్లిన యువకులు ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. సక్తి జిల్లా బుందేలీ గ్రామానికి చెందిన దీపక్ రాత్రే (24), అలాగే సారాగఢ్-బిలాయిగఢ్ జిల్లా ఛుయియా గ్రామానికి చెందిన భూపేంద్ర భైనా (28) ఉపాధి కోసం కొన్ని నెలల క్రితం జమ్ముకశ్మీర్‌కు వలస వెళ్లారు. కుల్గామ్ ప్రాంతంలోని ఒక ఇటుక బట్టీలో వారు పనిచేస్తున్నారు.

శుక్రవారం రాత్రి అక్కడకు వచ్చిన ఉగ్రవాదులు వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీపక్ రాత్రే కుటుంబానికి అతడే ఏకైక ఆధారం. ఆయనకు భార్య, నాలుగు నెలల కుమారుడు, వృద్ధురాలైన తల్లి,  దివ్యాంగుడైన తమ్ముడు ఉన్నారు. తండ్రి అప్పటికే మరణించగా, కుటుంబ భారాన్ని మోస్తున్న దీపక్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. మరోవైపు, భూపేంద్ర భైనా కూడా తన నలుగురు సంవత్సరాల కుమారుడిని ఇంట్లో ఉంచి, కష్టాల నుంచి గట్టెక్కడానికి కశ్మీర్‌కు వెళ్లాడు.

ఈ వార్త తెలియడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది పిరికిపంద చర్య అని అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని, మృతదేహాలను వారి స్వగ్రామాలకు రప్పించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: మాస్కోలో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)