Breaking News

ముస్సోరీలో తెలుగు టెకీ అనుమానాస్పద మృతి

Published on Tue, 06/16/2026 - 19:40

ముస్సోరీ: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హోమ్‌స్టేలో ఢిల్లీకి చెందిన ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పి.రాధా గాయత్రి(27)గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్‌లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తూ.. ఢిల్లీలోని కిద్వాయ్ నగర్ ఈస్ట్‌లో నివసిస్తున్నారు. ఆమె తన భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆయన కూడా పూణేలో ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి, ఆమె భర్త జూన్ 13న ఢిల్లీ నుండి రిషికేష్‌కు ప్రయాణమై.. మరుసటి రోజు (జూన్ 14) అర్ధరాత్రి దాటిన తర్వాత టిప్రి ధార్‌లోని 'కియానా హోమ్‌స్టే'కు చేరుకున్నారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో వారు 'బ్లిస్' అనే పేరున్న గదిలోకి చెక్-ఇన్ అయ్యారు. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. ఆ రాత్రి వారిద్దరూ మద్యం సేవించి.. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిద్రపోయారు. ఉదయం ఆయన నిద్ర లేచేసరికి.. భర్తకు తన భార్య దుస్తులు లేకుండా.. స్పృహ లేకుండా నేలపై పడి ఉండటం కనిపించింది. ఆమె చుట్టూ మూత్రం, ముక్కు నుండి రక్తం కారుతూ ఉందని తెలిపాడు.

రూమ్‌లో ఓ మహిళ స్పృహ లేకుండా పడి ఉందనే సమాచారం సోమవారం ఉదయం ముస్సోరీ పోలీసులకు అందడంతో వారు 108 అంబులెన్స్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌కు చెందిన ఫార్మసిస్ట్ ఆమెను పరీక్షించి.. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. వీరికి 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. గాయత్రి, శ్రీచరణ్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష నిమిత్తం డెహ్రాడూన్‌లోని ఆసుపత్రికి తరలించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)