Breaking News

‘కలెక్టర్‌ అంటే ఇలా ఉండాలి’.. వీడియో వైరల్‌

Published on Tue, 09/16/2025 - 11:08

దాతియా: కలెక్టర్‌ అనగానే ఎవరికైనా హుందాగా ఉండే ఒక రూపం గుర్తుకువస్తుంది. ఉన్నత పదవిలో ఉన్న అతనితో మాట్లాడాలంటే కాస్త భయమేస్తుంది. అయితే అలాంటి కలెక్టర్‌ చిన్నారులతో కలసిపోయి, వారు చెప్పేది శ్రద్ధగా వింటూ, వారి సందేహాలకు సమాధానాలిస్తుంటే ఎవరికైనా చూడముచ్చటేస్తుంది. సరిగ్గా  ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి, తెగ లైక్‌లు, షేర్‌లు దక్కించుకుంటోంది.
 

2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ వాంఖడే ఒక అనాథ బాలికతో ప్రేమతో హృదయపూర్వకంగా సంభాషిస్తున్న  వీడియో అందరి హృదయాలను దోచుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ క్లిప్‌లో వాంఖడే ఆ బాలికతో మాట్లాడుతున్నప్పుడు.. ఆమెకు కనిపించేలా వంగి ఉండటం, శ్రద్ధగా మాటలను వింటూ, ఆమె ముఖంలో చిరునవ్వులు పూయించేందుకు చేస్తున్న ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు వందలాది లైక్‌లు,షేర్‌లు దక్కుతున్నాయి. ఈ వీడియోను చూసివవారు వాంఖడే తీరును ప్రశంసిస్తున్నారు. మానవతా పాలన అంటే ఇదేనని ఒకరు వ్యాఖ్యానించగా, మరికొందరు ఆ చిన్నారి అభివృద్ధికి ఇది ప్రేరణగా నిలుస్తుందన్నారు. మరికొందరు కలెక్టర్ అంటే ఇలా ఉండాలని అంటున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)