Breaking News

అక్క కోసం దాచిన డబ్బుల్ని దొంగిలించి.. గోవాలో తమ్ముడు ఎంజాయ్‌

Published on Mon, 01/26/2026 - 09:15

ఢిల్లీ: పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి, మంచి కెరీర్‌ నిర్మించుకోవాలని విద్యార్థులు ఎన్నో ఆశలు పెంచుకుంటారు. కానీ కొన్నిసార్లు భరించలేని ఒత్తిడితో ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించే పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఓ విద్యార్థి మాత్రం అలా చేయలేదు. ఒత్తిడిని దూరం పెట్టి, ఎంజాయ్‌ చేయాలని గోవాకు వెళ్లిపోయాడు. అంతవరకు బాగానే ఉన్నా.. గోవాకు వెళ్లే ముందు ఆ విద్యార్థి చేసిన పనికి కుటుంబ సభ్యులు లబోదిబో మంటున్నారు.

ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల బాలుడు పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఒత్తిడి నుంచి బయట పడేందుకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో వెంటనే తన అక్క యూపీఎస్సీ ఫీజు కోసం ఇంట్లో దాచి పెట్టిన రూ.3లక్షల్ని దొంగిలించాడు. అనంతరం, ఎంజాయ్‌ చేసేందుకు గోవా వెళ్లాడు.

అయితే, కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో పోలీసులు సైబర్ ట్రాకింగ్ ద్వారా బాలుడిని గుర్తించారు. గోవాలో ఉన్నట్లు నిర్ధారించారు. స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక గోవా పారిపోయినట్లు చెప్పుకొచ్చాడు. గోవా వెళ్లేందుకు తన అక్క కోసం దాచిన మూడు లక్షల్ని దొంగించినట్లు నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

ఈ ఘటన విద్యార్థులపై పెరుగుతున్న పరీక్షల ఒత్తిడి ఎంత ప్రమాదకరమో మరోసారి చూపించింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై అధిక ఒత్తిడి పెట్టకుండా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)