Breaking News

Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి

Published on Thu, 01/16/2025 - 08:15

జమ్ముకశ్మీర్‌ను అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది.  రాజౌరి జిల్లాలో వ్యాపించిన ఈ రహస్య వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 15కుపెరిగింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా జమ్మూలోని ఒక ఆసుపత్రిలో  తొమ్మిదేళ్ల బాలిక అంతుచిక్కని రుగ్మతతో మరణించింది. దీంతో రాజౌరి జిల్లాలోని మారుమూల గ్రామమైన బాధల్‌లో గడచిన ఒకటిన్నర నెలల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగింది.

గత ఏడాది డిసెంబర్ 7 నుండి..
ఈ అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న మరణాలకు గల కారణాలను పరిశోధించడానికి పోలీసులు ఒక సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే బాధల్ గ్రామంలో మరణాలకు  అంతుచిక్కని వ్యాధి కారణమనే వాదనను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ ఖండించారు. కాగా జమ్మూలోని ఎస్‌ఎంజీఎస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జబీనా అనే బాలిక బుధవారం సాయంత్రం మృతిచెందిందని అధికారులు తెలిపారు. గడచిన నాలుగు రోజుల్లో ఆమె నలుగురు తోబుట్టువులు, తాత కూడా మృతిచెందాడని వారు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 7 నుండి కోట్రాంకా సబ్ డివిజన్‌లోని బాధల్ గ్రామంలోని మూడు కుటుంబాల్లో ఇటువంటి పరణాలు సంభవించాయని తెలుస్తోంది.

ప్రయోగశాలలకు నమూనాలు
తాజాగా ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఐదుగురు మరణించారని తెలియగానే ఆరోగ్య శాఖ ఇంటింటికీ వెళ్లి 3,500 మంది నుంచి నమూనాలను తీసుకుని, వివిధ ప్రయోగశాలలకు పరీక్ష కోసం పంపిందన్నారు. ఇదే సమయంలో ఈ వ్యాధితో మరో ముగ్గురు వ్యక్తులు మరణించడంతో దేశంలోని ప్రధాన ఆరోగ్య సంస్థల నుండి సహాయం కోరామన్నారు. దీంతో పలు వైద్య బృందాలు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయన్నారు.

11 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఏర్పాటు
మరోవైపు ఈ  పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బుధల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) వజాహత్ హుస్సేన్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసినట్లు రాజౌరి ఎస్‌ఎస్‌పీ గౌరవ్ సికార్వర్ తెలిపారు. ఏదైనా వ్యాధి కారణంగా మరణాలు సంభవించినట్లయితే, అది వెంటనే వ్యాపించి ఉండేదని, అది ఆ మూడు బాధిత కుటుంబాలకే పరిమితమై ఉండేదికాదన్నారు. పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌), ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ), గ్వాలియర్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఆర్‌డీఈ) మైక్రోబయాలజీ విభాగం బాధితుల నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. 

ఇది కూడా చదవండి: Delhi Elections-2025: బడా పార్టీలకు ఛోటా దళాల షాక్‌?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)