Breaking News

భర్తను వదిలేస్తే పోయేది కదా!

Published on Sat, 03/22/2025 - 17:48

ఆ భర్త భార్య, బిడ్డనే ప్రాణం అనుకున్నాడు. కానీ, ప్రియుడి మోజులో పడి ఆమె ఆ భర్తనే వద్దునుకుంది. అలాంటప్పుడు వదిలేసి వెళ్లిపోతే సరిపోయేది కదా అంటూ సోషల్‌మీడియా ఇప్పుడు కోడై కూస్తోంది. ఉత్తర ప్రదేశ్‌ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్‌ రాక్షసత్వంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్‌.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అందుకు సంబంధించిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వస్తున్నాయి.

సౌరభ్ శవానికి పోస్టుమార్టం పూర్తయింది. డ్రమ్ములో సిమెంట్‌తో కప్పబడిన శరీరభాగాలను డాక్టర్లు అతి కష్టం మీద బయటకు తీశారు. వాటికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం.. నిద్రమాత్రల కారణంగా సౌరభ్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ముస్కాన్ తన రాక్షసత్వాన్ని బయటపెట్టింది.

సౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.

ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.

ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు.  

ప్రియుడితో కలిసి మనాలికి
భర్తను హత్య చేసిన తర్వాత ప్రియుడితో కలిసి మనాలికి వచ్చిన ముస్కాన్.. ఆపై ట్యాక్సీలో కాసోల్ లోని తమ హెటల్ కు వచ్చినట్లు స్టాఫ్ ఒకరు తెలిపారు.  హెటల్ లో రూమ్ తీసుకున్న తర్వాత రోజులో ఒకసారి మాత్రమే బయటకు వచ్చి చాలా స్వల్ప సమయం మాత్రమే ఉన్నారని హోటల్ స్టాఫ్ లో మరొకరు తెలిపారు.

నా వైఫ్ అంటూ సిబ్బందితో గొడవ
హోటల్ చెక్ ఇన్ లో భాగంగా ఇద్దరి ఐడీ కార్డులను పరిశీలించే క్రమంలో ముస్కాన్ ప్రియుడు ఐడీ కార్డు చూపించాడు. ఆపై ఆమె ఐడీ కార్డును చూసేటప్పుడు హోటల్ సిబ్బంది చేతుల్లోంచి ఆ కార్డును లాక్కొని తన భార్య అంటూ వారితో వాదనకు దిగాడు.  ఆపై కొంత ఒత్తిడి తర్వాత ముస్కాన్ ఐడీ కార్డు కార్డును  కు ఇచ్చినట్లు సిబ్బంది పేర్కొన్నారు.

ఆరు రోజులు రూమ్ లోనే..
వారు వచ్చిన తర్వాత ఆరు రోజులు రూమ్ తీసుకున్నారని,  ఎక్కడికి వెళ్లకుండా రూమ్ లోనే ఉండిపోయేవారని హోటల్ సిబ్బంది తెలిపారు. సాధారణంగా ఎవరైనా మనాలికి వస్తే కొన్ని ప్లేస్ లకు వెళతారని కానీ వీరు అలా వెళ్లకుండా రూమ్ లోనే గడిపేవారన్నారు. ఫుడ్ ను ఒక్కసారే ఆర్డర్ చేసేవారని, క్లీనింగ్ కి కూడా ఒక్కసారే అనుమతి ఇచ్చేవారని సిబ్బంది తెలిపారు. అసలు బయటకు వచ్చేవారు కాదని, అనుమానం రాకుండా ఉండటానికి కేవలం ఏదొకసారి వచ్చి లోపలికి వెళ్లిపోయేవారట. మార్చి  16వ తేదీన వారు హోటల్ ను వెళ్లిపోయారని, వెళ్లే క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ కు తిరిగి వెళ్లిపోతున్నట్లు తమకు తెలిపారని స్టాఫ్ లో ఒకరు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)