Breaking News

ఢిల్లీలోని మురికివాడల కంటే.. శీష్‌ మహల్‌లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువ: అమిత్‌ షా

Published on Sun, 01/12/2025 - 06:05

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్‌ జాతీయ కన్వినర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అధికార నివాసం ‘శీష్‌ మహల్‌’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్‌ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు. 

దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్‌ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్‌ షా శనివారం జేఎల్‌ఎన్‌ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు. 

మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను పట్టించుకోకుండా, ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్‌ ‘ఆపద’ప్రభుత్వం అడ్డంకిగా మారిందన్నారు. గత పదేళ్లుగా ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని చెప్పారు. కనీసం తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ వసతులు కూడా లేని మురికివాడలు చెత్తకుప్పల్లా మారాయని చెప్పారు. సుమారు 5.25 లక్షల మంది ఢిల్లీ విద్యార్థులకు పాఠశాల విద్య అందడం లేదంటూ  కేజ్రీవాల్‌ను నిలదీశారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)