Breaking News

30 వేల మందిపై వేటు : వణికిపోతున్న ఐటీ ఉద్యోగులు

Published on Wed, 04/01/2026 - 15:03

ఐటీ కంపెనీలు ఇటీవలి కాలంలో మళ్లీ లేఆఫ్‌ల బాటపట్టాయి.  భారతీయ ఐటీ రంగంలో, ముఖ్యంగా ఒరాకిల్ (Oracle) సంస్థలో భారీ లేఆఫ్స్ బెంగళూరు లాంటి నగరాల్లో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.  తాజాగా ప్రముఖ  ఐటీ సంస్థ ఒరాకిల్ ఇండియా సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది.  త్వరలోనే మరో 30వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది. దీంతో ఏ క్షణాన ‘ఈ రోజే మీ చివరి పని దినం’ అనే సందేశాన్ని మోసుకొచ్చే మెయిల్‌  వస్తుందేమోనని  టెకీల గుండెల్లో రైళ్లు పరిగె డుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30,000 మందిని తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒరాకిల్ ఇండియాలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. మరికొన్ని వారాల్లో మరో విడత తొలగింపులు జరగవచ్చని అంచనా. రెండు దశాబ్దాల విస్తరణ తర్వాత భారతదేశ ఐటీ సేవల పరిశ్రమలో వృద్ధి వేగంగా మందగిస్తున్న తరుణంలో ఈ ఘటనలు  ఐటీ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్పనాయి.

మంగళవారం ఉదయం 6 గంటలకు (EST) తొలగించబడిన ఉద్యోగులకు  ఈ మెయిల్‌  పంపింది. "ఈ రోజే మీ చివరి పనిదినం" అని సంస్థ పేర్కొన్నట్లు సమాచారం.  "సంస్థాగత మార్పు"ను కారణంగా చూపుతూ, ఈ ఉద్యోగాలను తక్షణమే రద్దు చేసినట్లు తెలిపింది.

మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్‌కు చెందిన సౌరభ్ ముఖర్జీయా ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ,  ఐటీ రంగం ఒక నిర్మాణాత్మక మందగమనంలోకి ప్రవేశిస్తోందని అన్నారు. 2005 - 2020 మధ్య, ఐటీ సేవల సంస్థలు తమ ఆదాయాలను, ఉద్యోగుల సంఖ్యను ఏటా సుమారు 15శాతం చొప్పున పెంచుకున్నాయి. అయితే, కోవిడ్ తర్వాత నియామకాలు తగ్గడంతో ఆ వేగం ఇప్పుడు 5 నుండి 6 శాతానికి పడిపోయింది.

దాదాపు రెండు దశాబ్దాల పాటు ఒక వెలుగు వెలిగిన ఐటీ  రంగం ఇప్పుడు మందగిస్తోందని  ముఖర్జీయా  వ్యాఖ్యానించారు. ఏఐ (AI) ప్రాచుర్యం పొందక ముందే ఈ మందగమనం మొదలైందని ఆయన పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఈ మార్పును మరింత తీవ్రతరం చేస్తోంది. నీతి ఆయోగ్ యొక్క 2025 నివేదిక ప్రకారం, 2031 నాటికి ఐటీ సేవలు , కాల్ సెంటర్లలోని 20శాతం వరకు ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల ప్రభావితం కావచ్చని అంచనా.ఐసీఐసీఐ డైరెక్ట్ (ICICI Direct) నివేదిక ప్రకారం, ఐటీ రంగం "డిఫ్లేషనరీ ఫేజ్" (ధరల తగ్గుదల దశ) లోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల దాదాపు 80 బిలియన్ల  డాలర్ల ఆదాయం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

అలాగే ప్రస్తుతానికి లేఆఫ్స్ ప్రభావం ఐటీ నిపుణుల జీవనశైలి , రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావంఐటీ నిపుణుల ఆదాయంపై ఆధారపడిన బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ కోతల వల్ల ఇప్పటికే ఇల్లు కొన్నవారు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతుండగా, మిగిలిన ఉద్యోగులు భవిష్యత్తుపై భయంతో కొత్త కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు.ఖరీదైన ఇళ్ల నుండి తక్కువ ధరలో ఇళ్లను కొనుగోలు  చేయాలని భావిస్తున్నారు.   తమ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఖరీదైన ఇళ్లకు బదులుగా తక్కువ ధర గల ఇళ్లను ఎంచుకుంటున్నారు టెక్‌ నిపుణులు.మరోవైపుప్రస్తుతం ఐటీ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా AI ఆధారిత సేవలు కొత్త అవకాశాలను సృష్టించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఐసీఐసీఐలో భారీ స్కాం : 195 మంది కస్టమర్లు, రూ. 23 కోట్లు

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)