మద్యం మత్తులో వ్యాపారి కొడుకు హల్‌చల్‌.. లంబోర్గిని బీభత్సం

Published on Mon, 02/09/2026 - 11:14

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి కొడుకు మద్యం మత్తులో రెచ్చిపోయాడు. పీకల దాకా మద్యం సేవించి ఖరీదైన లంబోర్గిని కారుతో పాదచారుల పైకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలం నుంచి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేయగా.. స్థానికులు అతడిని పట్టుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ప్రముఖ పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివం ఆదివారం మద్యం మత్తులో లంబోర్గినిని(DL 8CBC 4018) వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో లంబోర్గిని కారు నడిపిన శివం.. హైస్పీడ్‌లో మొదట ఓ ఆటోను ఢీకొట్టి దాదాపు 10 అడుగుల ఎత్తులో గాల్లోకి ఎగిరి రోడ్డుపై ఉన్న పాదచారులు, వాహనాల పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అయితే, ప్రమాదం జరిగిన వెంటనే శివం ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా.. స్థానికులు అతడిని పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కారును స్వాధీనం చేసుకొని కేసుపై దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ అతుల్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే మరో కారులో అక్కడికి చేరుకున్న వ్యాపారి కేకే మిశ్రా బౌన్సర్లు స్థానికులపై దౌర్జన్యం చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. నిందితుడి తండ్రి కేకే మిశ్రా బన్షిదర్‌ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పెద్ద పొగాకు కంపెనీకి యజమాని. గతంలో ఈ సంస్థపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి రూ.100 కోట్లకు పైగా పన్ను ఎగవేత జరిగినట్లు గుర్తించింది. ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ గాయపడినవారు, స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.
 

ఈ ఘటనకు సంబంధించిన కేసులో తాజాగా మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈకేసులో ప్రధాన నిందితుడు శివం పేరు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు. ఎఫ్‌ఐఆర్‌లో అతడి పేరు లేకపోవడంతో ఈ కేసు చర్చనీయాంశంగా మారింది. అయితే, ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడి పేరు ఎందుకు లేదనే దానిపై పోలీసులు అధికారులు ఇంకా అధికారిక వివరణ ఇవ్వలేదు.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)