Breaking News

‘అందుకే కేరళ స్టోరీ ప్రదర్శన ఆగిపోయింది’: తమిళనాడు సర్కార్‌ 

Published on Tue, 05/16/2023 - 14:40

ఢిల్లీ: ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధాజ్ఞాలను వ్యతిరేకిస్తూ ఆ చిత్రనిర్మాతలు దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ నడుస్తోంది. అయితే గత విచారణలో సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌.. పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు ప్రభుత్వానికి వివరణ కోరుతూ నోటీసులు అందించగా.. ఆ నోటీసులకు తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. 

ది కేరళ స్టోరీ సినిమాను నిషేధించారనే వాదనను తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించిందని చెబుతూ ఆ చిత్ర నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో థియేటర్లలో సినిమా ప్రదర్శనను నిలిచిపోయిందే తప్ప.. ఆ విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. ‘‘మే7వ తేదీ నుంచి జనాలు థియేటర్లకు రాకపోవడం వల్లే ఎగ్జిబిటర్లు వాళ్లంతట వాళ్లే సినిమాను ప్రదర్శించడం ఆపేశారు. సినిమా థియేటర్లకు భద్రత కల్పించడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేద’’ని అఫిడవిట్‌లో పేర్కొంది. అంతేకాదు.. సినిమాలో చెప్పుకోదగ్గ నటులు ఎవరూ లేకపోవడమో/ అందులోవాళ్ల నటన బాగా లేకపోవడమో.. ఏ కారణాలవల్లనో చిత్ర ప్రదర్శన ఆపేసి ఉంటారని అభిప్రాయపడింది.

ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ థియేటర్‌ యజమానులపై, మల్టీప్లెక్స్‌ నిర్వాహకులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. సినిమా ఆగిపోవడంలో ప్రభుత్వ పాత్ర కూడా ఏం లేదు అని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఈ మేరకు మల్టీప్లెక్స్‌ నిర్వాహకుల నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్‌ను సైతం అఫిడవిట్‌లో పొందుపర్చింది తమిళనాడు ప్రభుత్వం. 

ఇదీ చదవండి: ప్రధానికి అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)