Breaking News

కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజుపై సంచలన ఆరోపణలు

Published on Wed, 08/20/2025 - 16:48

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఎంపీలు సంచలన ఆరోపణలకు దిగారు. లోక్‌సభలో.. ఆయన, మరో కేంద్ర మంత్రి కలిసి తమపై దాడి చేశారని మీడియా ముందుకు వచ్చారు. 

తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులపాటు నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేడు(బుధవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా.. లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి విసిరారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. 

ఆ సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు కలుగు జేసుకున్నారు. ‘‘సభా కార్యకలాపాలకు అడ్డు తగలడం.. ప్రతిపక్షాలకే మంచిది కాదు. ప్రత్యేకించి కొత్తగా ఎన్నికైన ఎంపీలకు. మీరెంత రచ్చ చేస్తే.. ప్రజలు మిమ్మల్ని అంతగా తిరస్కరిస్తారు. కాబట్టి.. చర్చలో పాల్గొనండి అని కోరారాయన. అయినా విపక్ష ఎంపీలు వినలేదు.

అయితే నిరసన కొనసాగుతున్న టైంలో.. కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ తమపై దాడి చేశారని టీఎంసీ ఎంపీలు మిథాలీ బాగ్‌, శతాబ్ది రాయ్‌ ఆరోపించారు. ‘‘ ఆ ఇద్దరూ మమ్మల్ని తోసేశారు.. దాడి చేశారు.. ఇది సిగ్గు పడాల్సిన విషయం’’ మిథాలీ బాగ్‌ మీడియాతో అన్నారు. అయితే.. 

దాడి ఆరోపణల నేపథ్యంలో స్పీకర్‌ కార్యాలయం స్పందించింది. ఎవరిపై అలాంటి దాడేం జరగలేదని ఓ ప్రకటన చేసింది. మరోవైపు.. అమిత్‌ షా ప్రసంగిస్తున్న టైంలో బిల్లుల ప్రతులను కొందరు విపక్ష ఎంపీలు చించేసి ఆయనపై విసిరేశారు. ఆ ఎంపీలను సస్పెండ్‌ చేయాలంటూ బీజేపీ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్‌ కార్యాలయం లోక్‌సభ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)