సందేశ్‌ఖాలీ కేసు: షాజహాన్‌ ఖాన్‌కు షాక్‌ ఇచ్చిన టీఎంసీ​

Published on Thu, 02/29/2024 - 16:02

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సందేశ్‌ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్‌ షాజహన్‌ ఖాన్‌పై తృణమూల్‌ కాంగ్రెస్ (టీఎంసీ) వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్‌ ఖాన్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ సస్పెన్షన్‌ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది. సందేశ్‌ఖాలీ కేసులో షాజహన్ ఖాన్‌  పోలీసులు అరెస్ట్‌ చేసిన కొన్ని గంటల్లో టీఎంసీ ఆయన్ను సస్పెండ్‌ చేసింది.

గత ఎన్నిరోజులుగా పరారీలో ఉన్న షాజహన్‌ ఖాన్ ఎట్టకేలకు పోలీసులు ఈ రోజు అరెస్ట్‌ చేశారు. సందేశ్‌ఖాలీలోని భూములు లాక్కొని.. అక్కడి మహిళలపై లైగింక దాడులకు పాల్పడినట్లు షాజహన్‌ ఖాన్‌తో ఆయన అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులు  సందేశ్‌ ఖాలీ గిరిజన మహిళలు షాజహన్‌ ఖాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.

లోక్‌సభ ఎన్నికలు సమయంలో ఈ నిరసనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు ‍స్పందించని టీఎంసీ.. నిన్న ప్రధానిమోదీ బెంగాల్‌ పర్యటన అనంతరం తమ నేత అరెస్ట్‌ కావటం ఆవెంటనే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయటం గమనార్హం. 

ఇక.. టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్, మంత్రి బ్రత్య బసు మీడియా సమావేశంలో తమ పార్టీ నేత షాజహన్‌ ఖాన్‌పై సస్పెన్షన్‌ విధించినట్లు మీడియాకు తెలిపారు. ‘సందేశ్‌ఖాలీ కేసు విషయంలో మేం చట్టప్రకారం నడుచుంటాం. కానీ.. ఈ విషయంలో బీజేపీ కావాలని  మాకు అడుగడుగునా అడ్డుపడుతోంది. బీజేపీకి మేము సవాల్‌ విసురుతున్నాం. మాజీ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలి.​ ప్రస్తుతం సందేశ్‌ఖాలీ విషయం మాకు కేంద్రానికి మధ్య.. బీజేపీకి టీఎంసీ మధ్య విషయం.  ఇక్కడ రెండు  పార్టీలు ఉ‍న్నాయి. ఒకటి మాటలు చెప్పేదైతే.. టీఎంసీ చెప్పిన మాటలను ఆచరిస్తుంది’అని డెరెక్ ఓబ్రియన్  అన్నారు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)