Breaking News

మమతకు మరో ఎదురుదెబ్బ.. లీగల్ నోటీసు కలకలం

Published on Sun, 06/14/2026 - 11:36

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎంపీ కకోలీ ఘోష్‌ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్.. మమతా బెనర్జీతో పాటు పలువురు సీనియర్ టీఎంసీ నేతలకు లీగల్ నోటీసులు పంపడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ ఘటన మమతకు ఊహించని షాకిచ్చింది.

అయితే, వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్ అయిన డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్.. తాను బరాసత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టీఎంసీ టికెట్ కోరినట్లు కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ న్యాయపరమైన చర్యలకు దిగారు. ఈ లీగల్ నోటీసులు మమతా బెనర్జీతో పాటు టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, కళ్యాణ్‌ బెనర్జీ, సౌగతా రాయ్‌, అలాగే పార్టీ నాయకురాలు సోనాలీ గుహలకు పంపినట్లు సమాచారం.

నాపై తప్పుడు ప్రచారం..
ఇటీవల టీఎంసీలో చెలరేగిన అంతర్గత విభేదాల సందర్భంగా కకోలి ఘోష్ దస్తిదార్ తిరుగుబాటుకు కారణం తన కుమారుడికి అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడమేనని కొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా మహువా మొయిత్రా చేసిన వ్యాఖ్యలను బైద్యనాథ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా..‘నా కోసం నా తల్లి ఎమ్మెల్యే టికెట్ అడిగిందనడం వంద శాతం అబద్ధం. రాజకీయ విభేదాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యులను లాగడం సరైంది కాదు’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లీగల్ నోటీసులో భాగంగా తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరువునష్టం కేసులు సహా తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఐ-ప్యాక్ ప్రతినిధులే..
తాను ఎప్పుడూ బరాసత్ నుంచి పోటీ చేయాలనే ఆసక్తి చూపలేదని బైద్యనాథ్ స్పష్టం చేశారు. అయితే టీఎంసీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐ-ప్యాక్ (I-PAC) ప్రతినిధులే తనను సంప్రదించి బరాసత్ నుంచి పోటీ చేయాలని కోరారని ఆయన పేర్కొన్నారు. అలాగే స్థానిక పార్టీ కార్యకర్తలు ఆరోగ్య శిబిరాల్లో పాల్గొనాలని పలుమార్లు ఆహ్వానించినట్లు కూడా నోటీసులో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ పరిణామం ఇప్పటికే తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కకోలి ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో టీఎంసీ ఎంపీల్లో ఒక వర్గం పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. తమకు మద్దతుగా గణనీయ సంఖ్యలో ఎంపీలు ఉన్నారని తిరుగుబాటు వర్గం ప్రకటించగా, పార్టీ అధిష్ఠానం వారిని "ద్రోహులు"గా అభివర్ణించింది. ఈ సంక్షోభం నేపథ్యంలో మమతా బెనర్జీ ఇటీవల పార్టీ సంస్థాగత నిర్మాణంలో పలు మార్పులు చేపట్టి తిరుగుబాటు నేతలను కీలక పదవుల నుంచి తప్పించారు. పార్టీపై తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)