Breaking News

కాలీగంజ్‌ ఉపఎన్నిక.. అభ్యర్థిని ప్రకటించిన టీఎంసీ

Published on Tue, 05/27/2025 - 12:38

నదియా: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో జూన్ 19న జరగనున్న కాలీగంజ్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక(Kaliganj Assembly by-election)కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)  తమ అభ్యర్థిగా అలీఫా అహ్మద్‌ను ప్రకటించింది. అలీఫా అహ్మద్ దివంగత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ కుమార్తె. ఈ విషయాన్ని ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో తెలిపింది.

‘పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మార్గదర్శకత్వంలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం. కాలీగంజ్‌ అభ్యర్థి అలీఫా అహ్మద్’ అని టీఎంసీ తెలిపింది. సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు నసీరుద్దీన్ అహ్మద్(Naseeruddin Ahmed) మృతితో కాలీగంజ్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ‘లాల్ దా’గా పేరొందిన అహ్మద్ తన 70వ ఏట కన్నుమూశారు. ఆయన కాలీగంజ్ నియోజకవర్గానికి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు.

ఈ సీటుకు ఎంతో రాజకీయ ప్రాముఖ్యత ఉంది. ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సవరణ తర్వాత, కాలీగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.5 లక్షల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలోని కాలీగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్ 19న ఉప ఎన్నిక జరగనున్నదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆదే రోజున ఉప ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాలీగంజ్‌ ఒకటి. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23న ప్రకటించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2. జూన్ 3న వీటి పరిశీలన జరగనుంది. అభ్యర్థులు జూన్ 5 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు. 

ఇది  కూడా చదవండి: ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు దుర్మరణం

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి