Breaking News

తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య

Published on Fri, 07/11/2025 - 08:56

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెన్నైలో తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, తిరుమల మిల్క్ డెయిరీలో రూ.45కోట్ల మేర మనీ ల్యాండరింగ్‌ జరిగినట్లు ఫిర్యాదు వచ్చాయి. దీంతో, పోలీసులు.. దీనిపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాకుండానే నవీన్‌ ఆత్మహత్య చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి చెన్నై బ్రిటానియా నగర్, ఫస్ట్ స్ట్రీట్‌లోని తన ఇంట్లో నవీన్ బొల్లినేని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, డెయిరీలో మనీ ల్యాండరింగ్‌ జరిగిందని.. దీనిపై విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. 

దీనిపై విచారణకు హాజరు కాకుండానే ఇలా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరెస్ట్ భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆత్మహత్యకు గల  కారణాలు తల్లికి, స్నేహితులకు, బంధువులకు నవీన్‌ మెయిల్స్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్య అనంతరం, నవీన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవీన్ బొల్లినేని స్వస్థలం కృష్ణా జిల్లాగా తెలుస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)