Breaking News

కలసివెళ్లి.. కానరాని లోకాలకు

Published on Sun, 03/02/2025 - 13:28

మైసూరు: ఐదుమంది భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. ఇంజినీరింగ్‌ కోర్సు అయిపోయిన తరువాత మంచి ఉద్యోగాలు చేద్దామని, లేదా మరింత ఉన్నత చదువులు చదవాలని భావించారు. అయితే వీకెండ్‌ టూర్‌ ఆలోచన– ఓ టిప్పర్‌ లారీ వారి స్వప్నాలను భగ్నం చేశాయి. ఐదుగురి కుటుంబాలలో అంతులేని విషాదాన్ని కలిగించాయి. సరదాగా సాగుతున్న విహారయాత్రలో టిప్పర్‌ లారీ డ్రైవర్‌ యమదూత మాదిరిగా విరుచుకుపడ్డాడు.  

మైసూరు నుంచి బయల్దేరి.. 
చామరాజనగర జిల్లా కొళ్లేగాళ వద్ద కారును టిప్పర్‌ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు దుర్మరణం చెందారు. కొళ్లేగాల రూరల్‌లోని చిక్కందువాడి గ్రామం వద్ద రహదారిలో ఈ విషాదం సంభవించింది. వివరాలు.. మైసూరు సిటీలో నివసించే శ్రీలక్ష్మీ, లిఖిత, మండ్యకు చెందిన సుహాన్, నితిన్, శ్రేయస్‌లు మైసూరు ఎంఐటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్నారు. వీరి వయస్సు 20– 23 ఏళ్లలోపు ఉంటుంది. అందరూ మంచి స్నేహితులు. మలె మహదేశ్వర బెట్టలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలను చూసుకుని, ఆ తరువాత హొగెనేకల్‌ జలపాతానికి వెళ్లాలని బయల్దేరారు. ఓ గంటన్నర పాటు ప్రయాణం సాగింది. 

మృత్యుశకటమైన టిప్పర్‌  
ఇంతలో ఓ టిప్పర్‌ లారీ వేగంగా వస్తూ మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసింది, ఈ క్రమంలో కారును ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లి రెండు వాహనాలు రోడ్డు పక్కకు పడిపోయాయి. కారు వెళ్లి ఓ నీటి గుంతలోకి పల్టీలు కొట్టింది. కారు చాలా భాగం నుజ్జయింది. ఈ తాకిడికిలో అందులో ఐదుగురు యువతీ యువకులు గాయాలతో ప్రాణాలు కోల్పోయారు.  స్థానిక ప్రజలు చేరుకుని కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మరోవైపు టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. కొళ్లేగాల రూరల్‌ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.  ఘటనాస్థలి భీతావహంగా మారింది.  

ఇరుకు, మలుపుల రోడ్డు : ఎస్పీ
జిల్లా ఎస్పీ బీటీ కవిత ఘటనాస్థలిలో మాట్లాడుతూ ఉదయం 9 గంటల సమయంలో మహదేశ్వర బెట్ట నుంచి వస్తున్న టిప్పర్‌ లారీ ఓవర్‌ టేక్‌ చేయబోతూ ఎదురుగా వస్తున్న విద్యార్థుల కారును ఢీకొట్టింది, ఆపై 26, 30 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రెండు వాహనాలూ రోడ్డుపక్కన బోల్తా పడ్డాయి అని తెలిపారు.

పరారీలో ఉన్న టిప్పర్‌ డ్రైవర్‌ కోసం గాలిస్తున్నట్లు ఆమె చెప్పారు. అక్కడ రోడ్డు ఇరుకుగా, అనేక మలుపులతో ఉండగా, టిప్పర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమని తెలిపారు. కొళ్లేగాల రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘోరం గురించి తెలియగానే తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆస్పత్రికి వచ్చారు. వారి రోదనలతో ఆస్పత్రిలో విషాదం నెలకొంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)