Breaking News

చంద్రయాన్ ప్రయోగంపై శాస్త్రవేత్తలకు అబ్దుల్ కలాం ప్రశ్న..?

Published on Wed, 08/23/2023 - 16:52

ఢిల్లీ: చంద్రయాన్ 3 ప్రాజెక్టు విజయవంతం అవుతుందని యావత్ దేశం ఎదురుచూస్తోంది. విక్రమ్ ల్యాండర్ నేడు సాయంత్రం 6.04 నిమిషాలకు జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ంగ్ కానుంది. దాదాపు నాలుగేళ్లుగా 1000 మంది శాస్త్రవేత్తల నిర్విరామ కృషికి ఫలితం దక్కనుందని ఇస్రో ఛైర్మని సోమనాథ్ తెలిపారు. 

సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2019లో ఇస్రో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అయితే.. సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియలో ఈ మిషన్ విఫలమైంది. చంద్రయాన్ 2 ప్రాజెక్టుకు ముందు భారత్ చంద్రయాన్ 1 ప్రాజెక్టు కూడా చేపట్టింది. ఈ మిషన్ జాబిల్లి కక్ష‍్యలో దాదాపు 3400 ఆర్బిట్‌లు తిరిగింది. 2009 ఆగష్టు 29న ఈ స్పేస్ క్రాఫ్ట్ కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత ఈ మిషన్ కూడా పూర్తయింది. 

అయితే.. చంద్రయాన్ 1 ప్రయోగం లాంచింగ్‌కి అప్పట్లో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంని పిలిచారు. అక్కడకు హాజరైన ఆయన చంద్రయాన్ 1 మిషన్ శాస్త్రవేత్తల బృందానికి ఓ ప్రశ్న వేశారు. ప్రయోగం విజయవంతం అయిందనడానికి రుజువులు ఏం ఉంటాయని అడిగారు. అందుకు ఫొటోలు మాత్రమే అని శాస్త్రవేత్తలు తెలపగా.. అవి సరిపోవని అయన చెప్పారు. చంద్రునిపై ఏదైనా వస్తువు వేయాలని సూచించారు. 

కలాం సూచనలు విన్న శాస్త్రవేత్తల బృందం.. ప్రయోగంలో మార్పులు చేసింది. ఆ తర్వాత చంద్రయాన్ 1 నుంచి టెర్రైన్ మ్యాపింగ్ కెమెరా భూమి ఫొటోలను పంపించినప్పుడు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ విషయమని విలేఖరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రయోగం నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదీ చదవండి: చంద్రయాన్-3 హీరోలు.. ఆ వెనుక ఉన్న మేధస్సు వీళ్లదే..

          

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)