Breaking News

మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌

Published on Thu, 11/02/2023 - 05:31

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు టైమ్స్‌ నౌ ఛానల్‌– ఈటీజీ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఒపీనియన్‌ పోల్‌లో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కే ఆధిక్యం ఉన్నట్లు వెల్లడైంది. మధ్యప్రదేశ్‌లో పోటా పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు స్వల్ప మొగ్గు కనపడుతోంది. బీజేపీ 43.7 శాతం ఓట్లతో 107–115 స్థానాల్లో నెగ్గే అవకాశాలున్నాయని పేర్కొన్న సర్వే.. కాంగ్రెస్‌ 44.9 ఓట్లతో 112–122 సీట్లు సాధిస్తుందని తేలి్చంది.

ఇతరులు కేవలం 1–3 స్థానాలకే పరిమితమవుతారని పేర్కొంది. మరోవైపు రాజస్తాన్‌లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో ఉందని టైమ్స్‌ నౌ సర్వే వెల్లడించింది. 43.8 శాతం ఓట్లతో బీజేపీ 114–124 స్థానాల్లో గెలవనుందని పేర్కొంది. కాంగ్రెస్‌ 41.9 శాతం ఓట్లతో 68 నుంచి 78 స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది.

చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ 51–59 స్థానాలతో స్పష్టమైన ఆధిక్యం సాధిస్తుందని, బీజేపీ 27 నుంచి 35 స్థానాలకు పరిమితమవుతుందని సర్వే వెల్లడించింది. పైన పేర్కొన్న మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణ విషయానికి వస్తే సర్వే వివరాలు పూర్తిగా అందనప్పటికీ ప్రాథమిక సమాచారాన్ని బట్టి అధికార బీఆర్‌ఎస్‌కే మొగ్గు కనపడుతోందని టైమ్స్‌ నౌ సర్వే పేర్కొంది.
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు