Breaking News

అసలే ట్రాఫిక్‌, రోడ్డుపై అనుకోని అతిధి, వైరల్‌ వీడియో

Published on Sat, 11/29/2025 - 14:51

సాక్షి,ముంబై:  మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు  ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అడవిలోంచి   బైటికి వచ్చిన ఒక పులి  రోడ్డుమీది తిష్ట వేసుకుని కూర్చుంది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు బెంబేలెత్తిపోయారు. చంద్రపూర్-మొహర్లి రోడ్డులోని తడోబా సమీపంలో  కనిపించిన ఈ దృశ్యం పలువురిన్ని ఆశ్చర్యపర్చింది. సఫారీలలో కూడా  కనిపించని ఈ దృశ్యాన్ని చూసి ఆహా ఏమి అదృష్టం అనుకుంటూ పులిని చూసి మురిసిపోయారు. ఈ సంఘటన తడోబా టైగర్ రిజర్వ్‌లోని బఫర్ జోన్‌లో జరిగిందీ సంఘటన.

ఆకాష్ ఆలం అనే స్థానిక యువకుడు ఈ వీడియోను రికార్డ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.  ఈ వైరల్ వీడియో ప్రకారం తడోబా టైగర్ రిజర్వ్ పార్క్  నుండి  రోడ్డుమీదకు వచ్చింది.  ఒక పులి రోడ్డు మధ్యలో కూర్చుని ఉండటం వల్ల రెండు వైపులా చాలా గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. అయినా  తమ కళ్ల ముందు  పులి రోడ్డుపై చాలా సేపు  ఉన్న దృశ్యాన్ని చూసి బాటసారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

నడి రోడ్డుపై దర్జాగా కూర్చున్న పులి వీడియో వైరల్ కావడంతో గ్రామస్తులు కూడా స్పందించారు. చంద్రపూర్ నుండి మొహర్లికి వెళ్లే మార్గం ఈ అడవి గుండా వెళుతుంది. రోడ్డుకు ఇరువైపులా  దట్టమైన అడవులు ఉండటం మూలంగా తరచుగా జంతువుల కదలికలు మామూలు అంటున్నారు గ్రామస్తులు. ఉదయం, సాయంత్రం వేళల్లో జంతువులు రోడ్డు దగ్గర తరచుగా కనిపిస్తాయని చెప్పారు. రోడ్డుపై అకస్మాత్తుగా  అడవి జంతువులు కనపడటం, మానుషులకు, వాటికి మధ్యఘర్షణలు జరుగుతాయట. దీంతోఅటవీ శాఖ ఆ అడవి గుండా వెళ్లేవారికి మార్గదర్శకాలను జారీ చేసింది. ఉదయం, రాత్రివేళల్లో   ఈ దారి వాడకాన్ని పరిమితం చేయాలని, అలాగే వేగాన్ని నియంత్రించాలని కోరింది. ముఖ్యంగా జంతువులు ప్రయాణిస్తున్నప్పుడు హారన్ మోగించ వద్దని లేదా వారి వాహనాల నుండి దిగవద్దని కోరింది.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)