Breaking News

మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి

Published on Sun, 09/15/2024 - 06:46

మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

అకస్మాత్తుగా ఇల్లు కూలిపోవడంతో 12 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, శిథిలాల నుండి మొత్తం ఆరుగురిని వెలికితీశారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. గాయపడిన ముగ్గురిని లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించారు.

మీరట్ డిఎం దీపక్ మీనా మీడియాతో మాట్లాడుతూ  సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా జాకీర్ కాలనీలోని మూడంతస్తుల ఇల్లు కూలిన విషయాన్ని ధృవీకరిస్తూ, శిథిలాల కింద ఆరుగురు సమాధి  అయ్యారని తెలుస్తోందని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

ఇది కూడా చదవండి: చమురు ట్యాంకర్‌కు మంటలు 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)