ముగ్గురు బాలికలపై కామాంధుడి లైంగిక దాడి..!

Published on Sat, 07/11/2026 - 12:20

కర్ణాటక: రాచనగరి మైసూరులో అమానుష ఘటన వెలుగు చూసింది. ముగ్గురు బాలికలపై ఓ కామాంధుడు లైంగిక దాడులకు పాల్పడ్డాడు.  నిందితుడు మొదట 9వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అసభ్యకరమైన వీడియో క్లిప్‌తో ఆమెను బెదిరించి, తన స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి చేశాడు. అనంతరం ఆమె తీసుకువచ్చిన మరో ఇద్దరు బాలికలపై కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ ఘోరం వెలుగు చూడగా పోలీసులు సదరు కామాంధుడిని కటకటాల వెనక్కు నెట్టి విచారణ చేస్తున్నారు. 

ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. ఓ బాలిక మైసూరులోని విజయనగరలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఆమెకు తన పొరుగు గ్రామానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తిని ఇన్‌స్టా ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అతను ఆమెతో నిరంతరం సంప్రదిసూ మాయమాటలతో తన ఇంటికి రప్పించుకున్నాడు. అతడిని నమ్మిన బాలిక విజయనగరలోని అతని ఇంటికి వచ్చింది. ఆ సమయాన్ని ఉపయోగించుకుని, అతను ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన మొబైల్‌ ఫోన్‌లో ఆమె అశ్లీల వీడియోను చిత్రీకరించాడు. అలా అతను ఆమెను పదేపదే లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత ఆ వీడియో క్లిప్‌లను చూపుతూ ఆమెను బెదిరించాడు.  

స్నేహితురాళ్లను తీసుకురమ్మని ఒత్తిడి 
తన స్నేహితురాళ్లను తనతో పాటు ఇంటికి తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక, తన ఇద్దరు స్నేహితురాళ్లను అతని ఇంటికి తీసుకువెళ్లింది. అతను వారిపై కూడా లైంగిక దాడికి పాల్పడటమేగాక మిగతా స్నేహితురాళ్లను కూడా తీసుకురమ్మని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఆందోళనకు గురైన ఆ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తెచ్చింది. 

దీంతో వారు ఒడనాడి సేవా సంస్థకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన స్పయాని, పరశు ఈ విషయాన్ని బాలల సంరక్షణ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలిక, ఆమె తల్లిదండ్రులు విజయనగర డివిజన్‌ ఏసీపీకి కూడా ఈ సంఘటనల గురించి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. బాలల సంరక్షణ కమిటీ కూడా బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

 

#

Tags : 1

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)