Breaking News

చొరబాటు రాకెట్‌ను ఛేదించిన అస్సాం పోలీసులు

Published on Wed, 08/21/2024 - 07:56

బంగ్లాదేశ్‌లో హింసాయుత వాతావరణం నెలకొన్న ప్రస్తుత తరుణంలో పలువురు బంగ్లాదేశీయులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే  భారత సైన్యం, పోలీసులు ఇలాంటివారిని పట్టుకుని, తిరిగి వారి దేశానికి పంపిస్తున్నారు. తాజాగా అస్సాంలోకి చొరబడిన ముగ్గురు  బంగ్లాదేశీయులను పోలీసులు తిరిగి  ఆ దేశానికి పంపించారు. వీరు భారత్‌లోకి ప్రవేశించేందుకు సహాయం చేస్తున్న  ఏజెంట్‌ను కూడా పోలీసులు  అరెస్టు చేశారు.

అలీ హుస్సేన్‌ అనే వ్యక్తి, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాడని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళను భారత అధికారులు తిరిగి ఆ దేశానికి అప్పగించిన దరిమిలా అలీని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఆ మహిళ తాను మరో 15 మందితో  కలసి ఆగస్టు 17న బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి, ఇద్దరు ఏజెంట్ల సహాయంతో భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇందుకోసం అలీకి 2,500 బంగ్లాదేశ్ టాకాలు చెల్లించానని పేర్కొంది.

కాగా అస్సాం పోలీసులు ముగ్గురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. వీరు త్రిపుర నుంచి భారత్‌లోకి ప్రవేశించారని, వారిని బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి జిల్లాకు చెందిన మహ్మద్ అబూ, అసదుల్ ఇస్లాం, మహ్మద్ సర్వర్‌గా గుర్తించామన్నారు. వీరిలో ఒకరి దగ్గర ఆధార్ కార్డు లభ్యమయ్యిదని ముఖ్యమంత్రి తెలిపారు. వీరు కూలి పనుల కోసం చెన్నైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాగా ఈ ముగ్గురు బంగ్లాదేశీయులు త్రిపుర అంతర్ రాష్ట్ర సరిహద్దు గుండా అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)