Breaking News

ఇరాన్‌లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్‌! 

Published on Thu, 05/29/2025 - 02:06

న్యూఢిల్లీ:  ఇండియా నుంచి ఇరాన్‌ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. వారు అపహరణకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇరాన్‌లోని ఇండియన్‌ ఎంబసీకి సమాచారం చేరవేశారు. ఆ ముగ్గురి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. దీనిపై ఇండియన్‌ ఎంబసీ వెంటనే స్పందించింది. ముగ్గురు భారతీయులు జాడ తెలియకుండా పోయారని, వారు ఎక్కడున్నారో గుర్తించాలని, వారి భద్రతకోసం చర్యలు తీసుకోవాలని ఇరాన్‌ ప్రభుత్వానికి బుధవారం విజ్ఞప్తి చేసింది. 

అలాగే గాలింపు చర్యలపై బాధితుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తోంది. ఇరాన్‌లో అదృశ్యమైన పంజాబ్‌ యువకుడి తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన తన కుమారుడిని దుండగులు కిడ్నాప్‌ చేశారని, అతడిని ప్రాణాలతో వదిలేయాలంటే డబ్బులు ఆవ్వాలని డిమాండ్‌ చేశారని చెప్పారు. ఇరాన్‌లో కనిపించకుండా పోయిన ముగ్గురు యువకులు పంజాబ్‌కు చెందినవారే. వర్క్‌ పర్మిట్‌పై ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు. 

ఆ్రస్టేలియాకు చేరుకోవాల్సి ఉండగా, ఏజెంట్లు వారిని ఇరాన్‌కు చేర్చినట్లు తెలుస్తోంది. అక్కడే వారు కిడ్నాప్‌ అయినట్లు సమాచారం. ట్రావెల్‌ ఏజెంట్లు తమవద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, తన కుమారుడిని డంకీ రూట్‌లో ఇరాన్‌కు తీసుకెళ్లారని యువకుడి తల్లి హసన్‌ప్రీత్‌ చెప్పారు. కిడ్నాపర్లు ఫొటోలు, వీడియోలు పంపించారని, అందులో ముగ్గురు యువకుల చేతులను తాళ్లలో కట్టేసినట్లు కనిపిస్తోందని అన్నారు. అంతేకాకుండా వారి శరీరాలపై గాయాలు ఉన్నాయని తెలిపారు. కిడ్నాప్‌ అయిన తర్వాత కొన్నిరోజులపాటు యువకులతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఈ నెల 11 నుంచి ఫోన్‌కాల్స్‌ ఆగిపోయాయి.  
 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)