Breaking News

బెంగుళూరులోని ప్రముఖ హోట‌ళ్ల‌కు బాంబు బెదిరింపు

Published on Thu, 05/23/2024 - 15:28

ముంబై: ప్రముఖ నగరాల్లో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్‌లు, ఎయిర్‌పోర్టులు, హాస్పిటల్స్‌, ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల ఢిల్లీలోని, హస్పిటల్స్‌, తీహార్‌ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్‌ అందిన విషయం తెలిసిందే.

తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని మూడు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. హోటల్‌ ఒట్టేరాతో సహా మరో రెండింటికి మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు బెంగళూరు ఆగ్నేయ డీసీపీ పేర్కొన్నారు. నేడు ఆ హోటళ్లు పేల్చివేస్తామని దీనిలో హెచ్చరించినట్లు చెప్పారు.

బెదిరింపు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్, బాంబు డిటెక్షన్  బృందాలను మోహరించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని, తనిఖీలు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

కాగా బుధవారమే దేశ రాజధాని ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌కు బెదిరింపు మెయిల్‌ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. అయితే అక్కడ ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేకపోవడంతో బెదిరింపు బూటకమని తేలింది. ఇక గతంలోనూ బెంగళూరులోని 40కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం విదితమే.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)