Breaking News

వెండి వ్యాపారి కుటుంబం ఆత్మహత్య

Published on Wed, 01/29/2025 - 11:01

సేలం (తమిళనాడు): రుణ వేధింపులతో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడన ఘటన సేలంలో మంగళవారం కలకలం రేపింది. వివరాలు.. సేలం జిల్లా అరిసిపాళయం ముత్యాల్‌ స్ట్రీట్‌ ప్రాంతానికి చెందిన బాల్‌రాజ్‌ (46) వెండి పని చేస్తున్నాడు. అతని భార్య రేఖ (40). వీరి కూతురు జనని(17). ఆ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పన్నెండో తరగతి చదువుతుంది. బాల్‌రాజ్‌ కొద్ది నెలల క్రితం కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేశాడు. ఈ స్థితిలో ఆయన చేస్తున్న వెండి వ్యాపారంలో నష్టం ఏర్పడడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. 

అప్పు ఇచ్చిన వారు సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి మంగళవారం ఉదయం అప్పు చెల్లించాలని, లేకుంటే పరువు తీస్తామని బెదిరించినట్లు సమాచారం. దీంతో బాల్‌రాజ్‌ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ఇరుగుపొరుగు వారు తెలిపారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం బంధువు పరామర్శకు వెళ్లగా.. ఇంటి మేడ గదిలో బాల్‌రాజ్, రేఖ, జనని ముగ్గురు ఉరి వేసుకుని మృతదేహాలుగా వేలాడుతూ కనిపించారు. దిగ్భ్రాంతికి గురైన బంధువును, ఇరుగుపొరుగు వారు అక్కడికి వెళ్లారు. ఈ ఆత్మహత్య ఘటనపై పల్లపట్టి పోలీసులకు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో కుటుంబ సమేతంగా వెండి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపడమే కాకుండా విషాదాన్ని నింపింది. కాగా ఘటనా స్థలంలో.. పోలీసులు బాల్‌రాజ్‌ రాసిన లేఖను స్వాదీనం చేసుకున్నారు.  

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)