Breaking News

మోదీ పర్యటన వేళ ఆత్మాహుతి దాడి బెదిరింపు లేఖ..అప్రమత్తమైన అధికారులు

Published on Sat, 04/22/2023 - 17:03

ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటనకు ముందు వచ్చిన ఆత్మహుతి దాడి బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపింది. మోదీ కేరళ పర్యటనకు వస్తే ఆత్మహాతి దాడులకు పాల్పడతామంటూ బీజేపీ కార్యాలయానికి లేఖ వచ్చింది. ఈ లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ కార్యాలయంలో అందుకున్నారు. దానిని గతవారమే పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసలు, కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు ప్రారంభించాయి. ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో కేరళలో పర్యటించనున్న సమయంలో ఈ బెదిరింపు లేఖ రావడంతో రాష్ట్రంలో అధికారుల అప్రమత్తమై హైలర్ట్‌ ప్రకటించారు.

ఈ మేరకు ఏడీజీపీ (ఇంటిలిజెన్స్‌ విభాగాం) ప్రధాని మోదీ పర్యటన సమయంలో భద్రతా ప్రోటోకాల్‌పై ఉత్తర్వులు జారీ చేసింది. అదీ మీడియాలో ప్రసారం కావడంతో ఈ లేఖ విషయం బయటకు వచ్చింది. ఆ లేఖలో మోదీ కేరళ పర్యటిస్తే.. ఆత్మహుతి దాడులకు పాల్పడతామంటూ బెదిరించారు. కొచ్చి నివాసి మలయాళంలో ఈ బెదిరింపు లేఖ రాసినట్లు ఇంటెలిజెన్స్‌ నివేదిక పేర్కొంది. ఐతే ఏడీజీపీ జారీ చేసిన ఉత్తర్వులు మీడియాకు లీక్‌ అవ్వడం వివాదాస్పదమైంది. ఇది ఘోర తప్పిదమని, దీనిపై విచారణ జరగాలని బీజేపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సురేంద్రన్‌ డిమాండ్‌ చేశారు. కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్‌ కూడా అసలు మీడియాకు ఎలా లీక్‌ అయ్యిందని ఫైర్‌ అయ్యారు.

వాట్సాప్‌లో ప్రధాని భద్రతకు సంబంధించిన 49 పేజీల నివేదిక ఎలా లీక్‌ అయ్యి, వైరల్‌ అయ్యిందో ముఖ్యమంత్రి వివరించాలని మురళీధరన్‌ డిమాండ్‌ చేశారు. దీని అర్థం రాష్ట్ర హోంశాఖ కుదేలైందనే కదా అంటూ ఆగ్రహం వ్యకం చేశారు మంత్రి మురళీధరన్‌. ఇదిలా ఉండగా, బెదిరింపు లేఖలో పేరు, నెంబర్‌ ఉన్న కొచ్చి నివాసి ఎస్సేజే జానీని విచారించడం ప్రారంభించారు పోలీసులు. అతని చేతి వ్రాతతో సహా ప్రతిదాన్ని క్రాస్‌ చెక్‌ చేశారు.

ఈ లేఖ వెనుక.. చర్చికి సంబంధించి వారికి ఏవో కొన్ని సమస్యలు ఉండటంతో ఆప్రాంతానికి చెందిన వ్యక్తులెవరో ఇలా రాసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీంతో కేరళ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడమే గాక తిరువనంతపురం, కొచ్చి నగరాల్లో దాదాపు రెండు వేలమంది పోలీసులు మోహరించారు. మరోవైపు షెడ్యూల్‌ ప్రకారమే మోదీ కేరళలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ వెల్లడించారు.  

(చదవండి: బంగ్లాను పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్‌..నేడు అధికారులకు అప్పగింత)

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు