Breaking News

మోదీపై ఆత్మాహుతి దాడి చేస్తాం

Published on Sun, 04/23/2023 - 04:52

కొచ్చిన్‌: ఈనెల 24, 25వ తేదీల్లో కేరళలో పర్యటించనున్న ప్రధాని మోదీని సూసైడ్‌ బాంబర్‌తో చంపేస్తామన్న బెదిరింపులపై పోలీసులు, కేంద్ర నిఘా విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందుకు సంబంధించిన లేఖ ఒకటి గత వారం రాష్ట్ర బీజేపీ విభాగానికి అందింది. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కె.సురేంద్రన్‌ దానిని పోలీసులకు అందజేశారు. ప్రధాని పర్యటన, బందోబస్తులో ఉండే అధికారుల వివరాలతో అదనపు డీజీపీ (ఇంటెలిజెన్స్‌) తయారు చేసిన నివేదిక శనివారం వైరల్‌ అవుతోంది. అందులోనే బెదిరింపు లేఖ అంశం ఉంది.

మలయాళంలో ఉన్న ఆ లేఖను కొచ్చిన్‌కు చెందిన ఎన్‌జే జానీ రాసినట్లుగా ఉంది. లేఖలో వాస్తవికత, దాని వెనుక ఉన్న వ్యక్తిపై విచారణ జరుపుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ఈ పరిణామంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్‌ స్పందించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన ముఖ్య విషయాలను లీక్‌ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సీరియస్‌ వ్యవహారమని, సీఎం విజయన్‌ స్పందించాలని కేంద్ర సహాయ మంత్రి మురళీధరన్‌ డిమాండ్‌ చేశారు. అనుమానితుడిగా పేర్కొంటున్న ఎన్‌జే జానీ శనివారం మీడియాతో మాట్లాడారు. సదరు బెదిరింపు లేఖతో తనకు సంబంధం లేదన్నారు. పోలీసులడిగిన అన్ని వివరాలను అందించానన్నారు. చర్చి వ్యవహారానికి సంబంధించి తనతో శత్రుత్వం ఉన్న వారే దీని వెనుక ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు