Breaking News

దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు?

Published on Tue, 10/31/2023 - 11:24

రాజభవనాల నుంచి బయటకు వచ్చి, రాజకీయాల్లో కాలుమోపిన మహరాజుల ట్రెండ్ 1951-52లో మొదలైంది. అప్పటి రాజు దివంగత హన్వంత్ సింగ్ రాథోడ్(జోధ్‌పూర్‌) లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఫలితాలు వెలువడకముందే విమాన ప్రమాదంలో మరణించారు. దీని తరువాత, అతని కుమారుడు గజ్ సింగ్, కుమార్తె రాజకుమారి చంద్రేష్ కుమారి కటోచ్ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇద్దరూ అదృష్టాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ‍ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్న రాణులు, యువరాణుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

విజయరాజే సింధియా: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1957లో రాణి రాజమాత విజయరాజే సింధియా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. 1957లో గుణ(మధ్యప్రదేశ్‌) లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన విజయరాజే సింధియా తొలిసారిగా పార్లమెంటుకు చేరుకున్నారు.

వసుంధర రాజే: గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన వసుంధర రాజే 1984లో బీజేపీ జాతీయ కార్యవర్గంలో చేరారు. 1985-87 మధ్య కాలంలో ఆమె భారతీయ జనతా యువమోర్చా రాజస్థాన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 1998-1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో వసుంధర రాజే విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. భైరోన్ సింగ్ షెకావత్ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత, రాజస్థాన్‌లో ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు. రాజస్థాన్‌లో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఝల్రాపటన్ నుండి పోటీచేస్తున్నారు. 

దియా కుమారి: జైపూర్ మహారాణి, కూచ్ బెహార్ యువరాణి గాయత్రీ దేవి కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, స్వతంత్ర పార్టీ ఎన్నికల గుర్తుపై 1962లో వరుసగా మూడుసార్లు గెలిచారు. ఆమె 2013లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2019లో బీజేపీ ఆమెకు లోక్‌సభ టికెట్ ఇచ్చింది. గెలిచిన తరువాత ఆమె పార్లమెంటులో స్థానం దక్కించుకున్నారు.

యశోధర రాజే సింధియా: యశోధర రాజే సింధియా, జీవాజీరావు సింధియా, దివంగత రాజమాత విజయరాజే సింధియాల కుమార్తె. 1998 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరపున పోటీచేసి గెలుపొందారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆమె ప్రకటించారు. 

గాయత్రీ రాజే పన్వార్: మధ్యప్రదేశ్‌లోని దేవాస్ రాజ కుటుంబానికి చెందిన గాయత్రీ రాజే పన్వార్‌కు దేవాస్ అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్ లభించింది. గాయత్రి ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. తుకోజీ రావు పవార్ ఈ స్థానం నుండి వరుసగా ఆరు సార్లు ఎన్నికయ్యారు. ఆయన 2015లో మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. అతని భార్య గాయత్రి రాజే పవార్ ఆ స్థానం నుంచి గెలిచారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. 

పక్షాలికా సింగ్: రాణి పక్షాలికా సింగ్ యూపీలోని బాహ్ అసెంబ్లీ స్థానానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే. ఆమె 2017లో బీజేపీలో చేరారు. యూపీలోని అత్యంత ధనిక మహిళా ఎమ్మెల్యే రాణి పక్షాలికా సింగ్. 2017లో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో తనకు సుమారు రూ.58 కోట్ల విలువైన చర, స్థిరాస్తులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: బాబాల మాయలో మధ్యప్రదేశ్‌ సర్కార్‌? ‘ఓట్ల ఆశీర్వాదం’ కోసం పడిగాపులు?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌