Breaking News

కేర‌ళ‌లో బీజేపీ స‌రికొత్త చ‌రిత్ర

Published on Fri, 12/26/2025 - 17:53

కేర‌ళ‌లో బీజేపీ స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. ఆ రాష్ట్రంలో తొలిసారిగా మేయ‌ర్ ప‌ద‌వికి కైవసం చేసుకుంది. కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురం మేయ‌ర్ ప‌ద‌విని ద‌క్కించుకుని కాషాయ పార్టీ న‌వ శ‌కం ఆరంభించింది. బీజేపీకి చెందిన వివి రాజేష్ మేయర్‌గా ఎన్నిక‌య్యారు. తిరువ‌నంత‌పురం న‌గ‌ర చ‌రిత్ర‌లో బీజేపీ పార్టీ అభ్య‌ర్థి మేయ‌ర్ ప‌ద‌విని అధిష్టించ‌డం ఇదే మొద‌టిసారి. శుక్ర‌వారం జ‌రిగిన మేయ‌ర్ ఎన్నిక‌ల్లో రాజేష్‌కు 51 ఓట్లు వ‌చ్చాయి. ఎల్‌డీఎఫ్ అభ్య‌ర్థి ఆర్పీ శివాజీకి 29, యూడీఎఫ్‌కు చెందిన కేఎస్ సబరినాథన్‌కు 19 ఓట్లు వచ్చాయి. తిరువ‌నంత‌పురం కార్పొరేష‌న్‌లో మొత్తం 101 వార్డులు ఉన్నాయి. 

తిరువ‌నంత‌పురం న‌గ‌ర అభివృద్ధికి శ‌క్తివంచ‌న లేకుండా పాటుప‌డ‌తాన‌ని మేయ‌ర్ రాజేష్ అన్నారు. బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అంద‌రినీ క‌లుపుకుని ముందుకు సాగుతాన‌ని, 101 వార్డులన్నింటినీ స‌మానంగా చూస్తామ‌ని చెప్పారు. కాగా, శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన మేయ‌ర్ ఎన్నిక‌ల్లో 99 మంది ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. స్వతంత్ర కౌన్సిలర్ పి. రాధాకృష్ణన్ మద్దతు తెల‌ప‌డంతో బీజేపీకి 51కి ఓట్లు వ‌చ్చాయి. స్వతంత్ర కౌన్సిలర్ ఒక‌రు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

ఎవ‌రీ రాజేష్‌?
వృత్తిరీత్యా న్యాయవాది అయిన 50 ఏళ్ల రాజేష్ ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. గతంలో తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవ‌ల జ‌రిగిన తిరువనంతపురం కార్పొరేష‌న్‌ ఎన్నిక‌ల్లో కొడుంగనూర్ వార్డు నుండి 515 ఓట్ల మెజారిటీతో ఆయ‌న‌ విజయం సాధించారు. ఆయ‌న కౌన్సిలర్‌గా ఎన్నిక కావ‌డం ఇది రెండోసారి. 2021 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వట్టియూర్కావు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ(ఎం)కి చెందిన వికె ప్రశాంత్ చేతిలో 21,515 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రశాంత్‌కు 61,111 ఓట్లు, రాజేష్‌కు 39,596 ఓట్లు వచ్చాయి. 

చ‌ద‌వండి: మ‌మ్మ‌ల్ని జైల్లో పెట్టండి

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)