మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
మహిళ గొలుసును కొట్టేస్తూ కెమెరాకు చిక్కిన దొంగలు: వీడియో వైరల్
Published on Sat, 04/15/2023 - 15:13
ఒక మహిళ గొలుసును బెక్ మీద నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు లాక్కుని పరారయ్యారు. అందుకు సంబంధించిన సీఫుటేజ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటు చేసుకుంది. వీడియోలో..దుకాణం వద్ద ఉన్న ఒక మహిళ వద్దకు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తున్నట్లు కనిపిస్తోంది. వారిని చూసి అప్రమత్తమైన మహిళ కేకలు వేస్తూ.. దుకాణం లోపలికి వస్తున్నట్లు కనిపిస్తోంది.
ఇంతలో ఆ వ్యక్తులు ఆ మహిళను తుపాకీతో బెదిరించి ఆమె మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యారు. ఆ దుకాణంలోని వ్యక్తి ఆమెకు సాయం చేద్దామని ముందుకు వస్తాడు కానీ వారి వద్ద ఉన్న తుపాకీని చూసి భయంతో పారిపోతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ఆ దుండగుల ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు.
Caught On Camera: Thieves Snatch Delhi Woman's Chain At Gunpoint pic.twitter.com/VEX5aGSBAJ
— NDTV Videos (@ndtvvideos) April 15, 2023
(చదవండి: విమానం గాల్లో ఉండగా విండ్ షీల్డ్‌కు పగుళ్లు.. సౌదీ ఫ్లైట్ కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్..)
Tags : 1