ఇంట్లోకి రాగానే ఆ దంపతులకు ఊహించని దృశ్యం..!

Published on Tue, 01/06/2026 - 18:12

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఓ వ్యక్తి  తన తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లి రాత్రి తిరిగి వచ్చినప్పుడు వారి ఇంట్లో ఊహించలేని దృశ్యం కనిపించింది. సుభాష్ కుమార్ రావత్ ఇంట్లో చోరీకి వెళ్లిన ఓ దొంగ.. ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దీంతో పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎవరూ లేని ఇంటిలో దొంగతనం చేయడానికి ప్లాన్‌ చేసిన ఓ దొంగ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రం నుంచి ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే కన్నంలో సగం దూరిన తర్వాత మధ్యలోనే ఇరుక్కుపోయాడు. బయటకురావడానికి చాలా ప్రయత్నించాడు. సాధ్యం కాకపోవడంతో కిందకి వేలాడుతూ ఉన్నాడు. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. నేల నుండి 10 అడుగుల ఎత్తులో తల, చేతులు ఇంట్లో లోపల ఉండగా కాళ్లు బయట వేలాడుతూ కనిపించాడు.

అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చిన యజమాని సుభాష్ కుమార్ రావత్ వంటగదిలోని ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ రంధ్రంలో దొంగ వేలాడుతుండడాన్ని గమనించారు. తాను దొంగనంటూ ఆ చెప్పిన ఆ వ్యక్తి ఆ దంపతులపై బెదిరింపులకు దిగాడు. తన సహచరులు బయట ఉన్నారని, తాను బయటపడనివ్వకపోతే వారు హాని చేస్తారంటూ హెచ్చరించాడు.

దీంతో ఆ దంపతులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాదాపు గంటపాటు శ్రమించి దొంగను కన్నం నుంచి బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరో ట్విస్ట్‌ ఏంటంటే.. చోరీ చేయడానికి వచ్చిన దొంగ ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు స్టిక్కర్‌ ఉన్న కారులో వచ్చినట్లు తెలిపారు. దీంతో ఒక్కసారిగా పోలీసులే షాక్‌ అయ్యారు. జనవరి 3న జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)