Breaking News

Delhi Pollution: తొలగని అంధకారం.. వైద్యుల హెచ్చరికలు

Published on Sun, 12/14/2025 - 08:12

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టేసింది.  ఉదయం ఏడు గంటలు దాటినా అంధకారం తొలగిపోలేదు. వాయు నాణ్యత (AQI) 'తీవ్రమైన' విభాగంలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఉదయం 6 గంటలకు AQIని 462గా నమోదు చేసింది. ఇది ఆరోగ్యకరమైనవారికి కూడా ప్రమాదకరమని, బయటికి వెళ్లడం లేదా వ్యాయామం చేయడం మానుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ఢిల్లీలోని మొత్తం 40 మానిటరింగ్ స్టేషన్లు ఎరుపు రంగు సూచికను చూపించాయి. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని రోహిణిలో అత్యధికంగా 499 AQI నమోదు కాగా, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (PM2.5) ప్రధాన కాలుష్యకారిగా ఉంది. జహంగీర్‌పురి, వివేక్ విహార్లలో కూడా AQI 495 వద్ద ప్రమాదకర స్థాయిలో  కొనసాగుతోంది.

దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దృశ్యమానత (visibility) గణనీయంగా తగ్గింది. ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని పట్‌పర్‌గంజ్‌కు చెందిన ఫొటోలలో వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్ చేసి, నెమ్మదిగా డ్రైవింగ్ చేయడం కనిపిస్తున్నది. AQI అనేది PM10,PM2.5,O3,SO2,NO2,CO,Pb, NH3 తదితర ఎనిమిది కాలుష్య కారకాల ఆధారంగా గాలి నాణ్యతను తెలియజేయడానికి ఉపయోగించే ఒక సాధనం. CPCB వర్గీకరణ ప్రకారం 401-500 మధ్య AQI 'తీవ్రమైన' విభాగంలోకి వస్తుంది. ఢిల్లీలో AQI 500 వద్ద పరిమితం చేశారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (NIAS) కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ గుఫ్రాన్ బేగ్ మాట్లాడుతూ AQI 500- 900 వద్ద ఆరోగ్య ప్రభావాలు ఒకే విధంగా ఉంటాయని, భయాందోళనలు  కలగకుండా ఉండేందుకు అధిక సంఖ్యలను చూపడం లేదన్నారు.
 

వాయు కాలుష్యం మరింత అధ్వాన్నంగా మారడానికి ప్రధాన కారణం స్థానిక ఉద్గారాలు మాత్రమే కాకుండా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గాలి వేగాన్ని గణనీయంగా తగ్గించాయి. గాలి దిశలో మార్పు, దిగువ వాతావరణంలో తేమ శాతం పెరగడం వంటివి కాలుష్య కారకాలు పేరుకుపోవడానికి అనుకూలంగా మారాయి. పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను నియంత్రించేందుకు కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) మొదట గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ 3 కింద పరిమితులను విధించింది. ఆపై మరింత దిగజారుతున్న పరిస్థితులలో దానిని GRAP-4కి మార్చింది. 'తీవ్రమైన' విభాగంలో AQI ఉండటంతో హృదయ, శ్వాసకోశ బాధితులకు తక్షణ వైద్య అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)