Breaking News

‘వారిది ఇన్ఫోసిన్‌.. అలా అంటే మనం ఏం చేస్తాం?’

Published on Fri, 10/17/2025 - 16:25

బెంగళూరు:  కర్ణాటకలో చేపట్టిన సామాజిక, విద్యా సర్వేను వ్యతిరేకించిన కారణంగా ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తిపై కర్ణాటక ప్రభుత్వ  పెద్దలు విమర్శలు గుప్పిస్తున్నారు. వీరికి(నారాయణమూర్తి దంపతులకు) వెనుకబడిన వర్గాలన్నా, కుల గణన అన్నా చిత్తశుద్ధి లేదని మండిపడుతున్నారు. ఇదే వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం తన నోటికి పని చెప్పారు. వారికి అన్ని తెలుసంటూనే. వారికి మనం ఏం చెబుతామంటూ సెటైరికల్‌ వ్యాఖ్యలు చేశారు.

‘ ఇది కేవలం సామాజిక మరియు విద్యా సర్వే. అంతే కానీ వెనుకబడిన వర్గాల సర్వే కానే కాదు.. ఇది జనాభా గణాంకాల కోసం నిర్వహించే సర్వే మాత్రమే. ఈ విఫయాన్ని చాలాసార్లు చెప్పాం కూడా. ఇప్పటి వరకూ కనీసం 20 సార్లు అయినా ఇది జనాభా లెక్కల సర్వే అని చెప్పాం. అయినా వారు వెనుకబడిన వర్గాల గణాంకాల సర్వే అనుకుని అందులో పాల్గొనమని చెప్పారు.  అది వారికే వదిలేద్దాం.  ఈ విసయాన్ని వారు అర్థం చేసుకోలేకపోతే మనం చేస్తాం. వారిది ఇన్ఫోసిన్‌.. వారికంతా తెలుసు’ అంటూ సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. 

కాగా, కర్ణాటక రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (KSCBC) చేప‌ట్టిన  సామాజిక స‌ర్వే, కులగణన అక్టోబర్ 19 వ‌ర‌కు కొన‌సాగుతుంది.   రూ. 420 కోట్ల అంచనా వ్య‌యంతో చేప‌ట్టిన‌ ఈ సర్వేలో 60 ప్రశ్నలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి స‌ర్వే నివేదిక అందుతుంద‌ని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీ చదవండి:
మూర్తిగారూ.. ఇదేంటండీ?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)