అయోధ్య రామ మందిర మార్గంలో దొంగల చేతివాటం

Published on Wed, 08/14/2024 - 08:01

అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో దొంగలు చేతి వాటం చూపించినట్లు తెలుస్తోంది. భక్తులు అయోధ్యలోని రామమందిరానికి చేరుకునే మార్గాలైన భక్తిపథ్‌, రామ్‌పథ్ మార్గాల్లో అమర్చిన రూ.50లక్షల విలువైన దాదాపు 3,800 బాంబో లైట్లు, 36 గోబో ప్రొజెక్టర్లు కనిపించకుండా పోయినట్లు పీటీఐ నివేదించింది.

పీటీఐ కథనం ప్రకారం.. భక్తిపథ్‌ మార్గం రామాలయానికి వెళ్లే ప్రధాన రహదారి. ఇది శృంగార్ ఘాట్ నుండి హనుమాన్ గర్హికి చివరకు ఆలయానికి కలుపుతుంది. అయోధ్యలోని మరో కీలక మార్గం రామ్ పథ్, సదత్‌గంజ్‌ను నయా ఘాట్‌ను కలుపుతూ 13 కిలోమీటర్ల పొడవైన హైవే.

అయితే ఈ రామ్‌ పథ్‌ మార్గంలో లైట్లను అమర్చే కాంట్రాక్ట్‌ను అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ యష్ ఎంటర్‌ప్రైజెస్, కృష్ణ ఆటోమొబైల్స్ సంస్థలకు అప్పగించింది. రామ్‌పథ్‌లో మొత్తం 6,400 బాంబో లైట్లను, భక్తి పథ్‌లో96 గోబో ప్రొజెక్టర్ లైట్లను ఏర్పాటు చేశాయి. కానీ మే 9 తర్వాత 6,400 బాంబో లైట్లలో 3,800 బాంబో లైట్లు చోరీకి గురైనట్లు ఆ సంస్థ ప్రతినిధులు గుర్తించారు.

తాము అమర్చిన లైట్లు, ప్రొజెక్టర్లు చోరీకి గురైనట్లు సంస్థ ప్రతినిధి శేఖర్‌ శర్మ ఆగస్టు 9న రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)