Breaking News

ముంబై ఓటమి తర్వాత ఠాక్రేల స్పందన.. ఏమన్నారంటే?

Published on Sat, 01/17/2026 - 15:08

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి. అధికార మహాయుతి కూటమి  పురపాలక సంస్థ ఎన్నికలలో ప్రభంజనం సృష్టించింది. 25 ఏళ్లకు పైగా ముంబైని శాసించిన ఠాక్రే కుటుంబానికి ఈ సారి ముంబై పీఠం కోల్పోవాల్సి వచ్చింది. అయితే దీనిపై శివసేన (ఠాక్రే) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. పదవిలో లేకపోయినా మరాఠా ప్రజలకు శివసేన ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.

దివంగత నేత బాలసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ ఒకప్పుడు మహారాష్ట్ర రాజకీయాలను శాసించింది. మరాఠా సంస్కృతి, భాష స్థానికతే ప్రధాన ఎజెండాగా ఆ పార్టీ రాజకీయాలు జరిపింది. అయితే ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహించిన శివసేన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం తిరుగులేని అధిపత్యాన్ని కనబరిచేది. గత 25 ఏళ్లుగా ముంబై మేయర్‌ పీఠం శివసేన( ఠాక్రే) వర్గానిదే అంటే ఆ ప్రాంతంలో ఠాక్రేలు ఎంత ప్రభావం చూపగలరో చెప్పవచ్చు. అయితే నిన్న( శుక్రవారం) జరిగిన ముంబై మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి స్పష్టమైన అధిపత్యం కనబరిచి ముంబై పీఠం కైవసం చేసుకుంది.

ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే సోదరులు ఓటమి  తర్వాత తొలిసారిగా స్పందించారు. దివంగత నేత బాలాసాహెబ్ ఠాక్రేతో ఫోటోతో కూడిన లేఖను ఉద్దవ్ ఠాక్రే పోస్టే చేశారు." చేసే పోరాటం ముగియలేదు. మరాఠీలకు వారు కోరుకున్న విధంగా గౌరవం లభించేంత వరకూ ఇది ముగియదు" అని అన్నారు. 

ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌ ఠాక్రే స్పందిస్తూ "ప్రస్తుతం అధికారంలో ఉన్న శక్తులు మరాఠా ప్రజలను వేదించడానికి లభించే ఒక్క అవకాశాన్ని కూడా వదలరు. కనుక మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు వచ్చిపోతుంటాయి. కానీ మనం మరాఠా ప్రజలకోసం ఉ‍న్న సంగతి మర్చిపోకూడదు. మరాఠా ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా జరిగితే తమ పార్టీ కార్పొరేటర్లు వారిని మోకాళ్ల మీద నిలబడేలా చేస్తారు" అని లేఖ విడుదల చేశారు.

కాగా మహారాష్ట్రలో 29 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 25 చోట్ల మహాయుతి కూటమి విజయాన్ని సాధించింది. అక్కడ మెుత్తం 227 కౌన్సిల్ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 114 అయితే బీజైపీకి 89 స్థానాలు రాగా శివసేన (శిండే) 29 వార్డులు సాధించింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)