Breaking News

రాధిక వాట్సాప్‌ చాట్‌లో సంచలన విషయాలు..!

Published on Sat, 07/12/2025 - 16:55

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో కన్న తండ్రి దీపక్‌ యాదవ్‌ చేతిలో దారుణ హత్యకు గురైన టెన్నిస్‌ ప్లేయర్‌ రాధికా యాదవ్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. 

రాధికా యాదవ్‌ టెన్నిస్‌ కోచ్‌లలో ఒకరైన అజయ్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం..  ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్‌ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్‌ చాట్‌ టెక్ట్స్‌ మెసేజ్‌లు, వాయిస్‌ చాట్‌లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్‌ యాదవ్‌ ఎన్డీటీవీకి స్పష్టం చేశారు. 

ఆంక్షలు భరించలేకపోతున్నా.. !
తాను ఇంట్లో ఆంక్షలను భరించలేకపోతున్నానని, ప్రతీ దానికి వివరణ ఇచ్చు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాధికా తనతో వాట్పాప్‌ చాట్‌లో తెలిపిందన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది అక్డోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లలో ఇంటికి దూరంగా వెళ్లిపోవాలనుకుందని, అందుకోసం విదేశాలకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకుందన్నారు. 

తాను తొలుత చైనా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఫుడ్‌ తనకు సరిపడదనే విషయంతో ఆగిపోయిందన్నారు. దుబాయ్‌, ఆస్ట్రేలియాకు వెళ్లి ఒక నాలుగు నెలల పాటు ఒంటిరిగా ఉండాలని, లైఫ్‌ను ఎంజాయన్‌ చేయాలని ఆమె పేర్కొన్నట్లు అజయ్‌ స్పష్టం చేశారు. తనకు ఏవో కొన్ని లక్ష్యాలున్నాయని, దాని కోసం తండ్రి దీపక్‌ యాదవ్‌కు చెబితే కనీసం వినడం కూడా చేయడం లేదని ఆమె మెసేజ్‌లో వాపోయింది. 

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..!
మరో కోచ్‌ అంకిత్‌ పటేల్‌ ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. అసలు అండ్రీ-కూతుళ్ల మధ్య ఇంతటి వివాదం దాగి ఉందనే విషయం ఎప్పుడూ తమకు తెలియదన్నారు. ‘ నాకు రాధికా యాదవ్‌ 11-12 ఏళ్ల నుంచే తెలుసు. అలాగే ఆమె తండ్రి కూడా బాగా తెలుసు. ఆమె టెన్నిస్‌ ప్రాక్టీస్‌కు సంబంధించి తండ్రీ-కూతుళ్ల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. తండ్రి ఎప్పుడూ ఆమె సపోర్ట్‌గా నిలిచేవారు. 

ఆమె ఎక్కడ టెన్నిస్‌ మ్యాచ్‌ ఆడటానికి వెళ్లినా వెంటే ఉండి అన్నీ చూసుకునే వారు.  రాదికా ఎప్పుడూ ఒంటిరగా ఉండటాన్ని కానీ వేరే వాళ్లతో ఉండటం కానీ నేను చూడలేదు.  టెన్నిస్‌ ఆటకు సంబంధించి వీరి మధ్య గొడవలున్నాయనేది వాస్తవం కాదు.  ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరి తెలుసు’ అని సదరు కోచ్‌ అంకిత్‌ పటేల్‌ తెలిపారు.

ఇదీ చదవండి:

ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు..!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)