YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం
Breaking News
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు
దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19కి చేరిన మృతుల సంఖ్య
ఏపీలో గూండా రాజ్.. మూడో రోజూ దౌర్జన్యకాండ
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
శబరిమలలో తెలుగు స్వాములకు ఘోర అవమానం!
Published on Wed, 11/19/2025 - 14:13
శబరిమలలో ఈసారి అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాట్లలో ఆలయ నిర్వాహకులు, అలాగే ప్రభుత్వం విఫలమవుతోందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఘోర అవమానం జరిగింది. ఓ పోలీస్ అధికారి భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో స్వాములు ఆందోళనకు దిగారు.
తాము దారి తప్పి వెళ్తన్న క్రమంలో ఓ పోలీస్ అధికారి ఎదురు పడ్డాడని.. దర్శనం క్యూ ఎక్కడ అని అడిగినందుకు ప్యాంట్ జిప్పు విప్పి అసభ్య సైగలు చేశాడని భక్తులకు తెలిపారు. ఈ మేరకు ఓ భక్తుడు మిగతా స్వాములతో ఆ వీడియోను తీసి నెట్‌లో షేర్ చేశాడు.
ఆ అధికారి తీరును ఖండిస్తూ తాము నిరసన చేపట్టామని.. ఇంతలో కొందరు అధికారులు ఆ పోలీసు అతన్ని దొడ్డిదారిన పంపించి రక్షించారని భక్తులు ఆరోపించారు. తెలుగు భాషలో మాట్లాడినందుకే తమకు ఇలాంటి ఘోర అవమానం ఎదురైందని భక్తులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. శబరిమలలో ఇతర రాష్ట్రాల భక్తులకు ఈ తరహా చేదు అనుభవాలు ఎదురు కావడం కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అయితే.. ఈసారి భక్తులకు అలాంటి పరిస్థితులు ఎదురు కాబోవని నిర్వాహకులు ఇటు కేరళ ప్రభుత్వం, అటు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) భరోసా ఇచ్చాయి. అయినా కూడా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.
#
Tags : 1