Breaking News

ఇండిగో సంక్షోభం.. తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

Published on Sat, 12/06/2025 - 15:30

సాక్షి, హైదరాబాద్‌: ఇండిగో సంక్షోభంతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు, చెన్నైకు స్లీపర్‌ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.  శంషాబాద్‌లో అందుబాటులో ఉండే ఈ ఆర్టీసీ స్లీపర్‌ బస్సులు.. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరనున్నాయి. రాజమండ్రి, కాకినాడ, విశాఖకు అదనపు బస్సులను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. విమానాల రద్దుతో భారత రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌-చెన్నై,చర్లపల్లి- కోల్‌కత్తా, హైదరాబాద్‌ నుంచి ముంబైకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. 37 రైళ్లకు 116  కోచ్‌లు జోడించాలని  రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అదనపు బోగీలతో కొన్ని రైళ్లు నడుస్తున్నాయి.

కాగా, రేణిగుంట విమానాశ్రయంలోనూ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇండిగో సంస్థ తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఒక పక్క సంక్షోభం కొనసాగుతుండగానే  ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)