కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన
Published on Mon, 05/16/2022 - 17:53
Rain Forecast In Telangana.. దేశ ప్రజలకు భారత వాతవరణ శాఖ శుభవార్త చెప్పింది. సోమవారం అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ప్రకటించింది. దీంతో, 23 రోజుల ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 16, 2022
ఇక, రుతుపవనాల రాకతో అండమాన్ నికోబర్ దీవులు సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరోవైపు, రానున్న నాలుగు, ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, దక్షిణ కర్నాటక తీరంలోభారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. మరో 24 గంటల్లో తమిళనాడు, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 16, 2022
ఇది కూడా చదవండి: జీవవైవిధ్యం ఉట్టిపడేలా.. ప్రతి ఉమ్మడి జిల్లాలో బయోడైవర్సిటీ పార్కు
Tags : 1