టీనేజ్‌ పిల్లల్లో పాప్‌కార్న్‌ బ్రెయిన్‌

Published on Thu, 07/30/2026 - 00:43

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌: ఈ డిజిటల్‌ యుగంలో పిల్లలు ఏకకాలంలో ఒకవైపు టీవీ చూస్తూనే, ఫోన్‌లో చాట్‌ చేస్తూ, గేమ్స్‌ ఆడటం సర్వసాధారణం అయిపోయింది. వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డేవిడ్‌ ఎం.లెవీ దీనినే ’పాప్‌కార్న్‌ బ్రెయిన్‌’ అన్నారు. డిజిటల్‌ మల్టీటాస్కింగ్‌కు అలవాటు పడి, పాప్‌కార్న్‌లాగా ఆలోచనలు ఒకదాని వెనుక ఒకటి వేగంగా దూకడం, నిజ జీవితంలోని నెమ్మదైన పనులపై ఏకాగ్రత కోల్పోవడాన్ని ఇది సూచిస్తుంది. దీనిని మానసిక సమస్య అని నిర్ధారించలేదు. కానీ ఆందోళన పడాల్సిన మానసిక స్థితి అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇది టీనేజ్‌ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

పాప్‌కార్న్‌ బ్రెయిన్‌  లక్షణాలు
⇒ ఒకే పనిపై ఎక్కువ సేపు దృష్టి పెట్టలేకపోవడం, ఒక విషయం మీద ఆసక్తి, శ్రద్ధ వెంట వెంటనే మారిపోవడం ళీ నిమిష నిమిషానికి నోటిఫికేషన్లు, కొత్త డిజిటల్‌ కంటెంట్‌ కోసం పరితపించడం 
⇒ సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో వైఫల్యం. పెద్దల సూచనలను పాటించడంలో మైండ్‌ను వెంటనే కనెక్ట్‌ చేసుకోలేక ఇబ్బంది పడటం. ఒక్కమాటలో చెప్పాలంటే పరధ్యానం. ళీ నిద్ర లేమి, ఆందోళన చెందడం, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం

తల్లిదండ్రులు ఏం చేయాలి?
⇒ రోజూ కొంత సమయం స్క్రీన్‌లు లేకుండా ప్రశాంతంగా, వర్తమానంలో గడపడం వల్ల మెదడు తిరిగి ఏకాగ్రతను పుంజుకుంటుంది. 
⇒ స్క్రీన్‌ వినోదానికి కేటాయించినంత సమయాన్ని శారీరక శ్రమకు, ఇతర హాబీలకూ కేటాయించాలి. పిల్లల చదువు పూర్తయిన తర్వాత మిగిలిన సమయానికి తగినట్లు టైంటేబుల్‌ ఇవ్వాలి. 

⇒ పిల్లలకు నిరంతరం ఏదో ఒక డిజిటల్‌ స్టిమ్యులేషన్‌ అవసరం లేదు. ఖాళీగా ఉండటం వల్ల వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ఆలోచనల రెక్కలు విచ్చుకుంటాయి. సహనం పెరుగుతుంది.

⇒ వర్చువల్‌ ప్రపంచం కంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా ముఖాముఖి గడిపేలా ప్రోత్సహించాలి. 
⇒ ఇష్టమైన పుస్తకాలు చదవడం వంటి హాబీలను ప్రోత్సహించాలి. చదివిన విషయాన్ని ఇంట్లో వాళ్లతో చర్చించే వాతావరణం కల్పించాలి. తల్లిదండ్రులతో కలిసి వాకింగ్‌ చేయడం అలవర్చాలి. పజిల్‌ పూరించడం, డ్రాయింగ్‌ లేదా క్రాఫ్ట్‌ వంటి హాబీలతో చిన్న చిన్న ప్రాజెక్టు చేసేవిధంగా ప్రోత్సహించాలి.  

పిల్లలపై ప్రభావం 
మెదడు అభివృద్ధి చెందే కీలక దశలో డిజిటల్‌ పరధ్యానం వారిలో కొత్త  విషయాలను నేర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీస్తుంది. అధ్యయనాల ప్రకారం, మితిమీరిన ఇంటర్నెట్‌ వాడకం పిల్లల్లో వాచిక మేధస్సు తగ్గడానికి కారణమవుతోంది. అలాగే, నిజ జీవిత సామాజిక నైపుణ్యాలు లోపించి, చిన్న సమస్యలకే వారు అధిక ఒత్తిడికి గురవుతున్నారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)