Breaking News

దడ పుట్టిస్తున్న పరువు హత్య: 17 ఏళ్ల యువతిని కాల్చేసి, మృతదేహాన్ని నదిలో తోసేసి..

Published on Mon, 09/29/2025 - 10:56

మోరెనా : మధ్యప్రదేశ్‌లో మరో అత్యంత దారుణ పరువు హత్య వెలుగు చూసింది. ఉన్నత కులానికి చెందిన 17 ఏళ్ల యువతి.. వెనుకబడిన కులానికి చెందిన యువకునితో స్నేహం చేసిందని ఆరోపిస్తూ, ఆ యువతి కుటుంబీకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. యువతి మృతదేహం అనుమానాస్పద స్థితిలో నదిలో పోలీసులకు కనిపించిన దరమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.

బాధితురాలిని 17 ఏళ్ల దివ్య సికార్వర్‌గా, ఆమె మోరెనా జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. 12వ తరగతి చదువుతున్న దివ్య శనివారం నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, దివ్య మృతదేహం ఒక నదిలో కనిపించింది. ఆమె తండ్రి భరత్ సికార్వర్ కుమార్తె మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి, దానిని రాయికి కట్టి, వారి ఇంటికి 30 కి.మీ దూరంలో ఉన్న కున్వారీ నదిలో విసిరేశాడని పోలీసుల విచారణలో తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దివ్య ఉన్నత కులానికి చెందినది. అయితే ఆమె వెనుకబడిన కులానికి చెందిన యువకుడితో స్నేహం చేస్తూ వచ్చింది. దీంతో ఆ అగ్రకులానికి చెందినవారు  దివ్య కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి, ఆ యువకుని హత్యకు పురిగొల్పివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత పోలీసుల విచారణలో మృతురాలి తల్లిదండ్రులు విరుద్ధమైన  సమాధానాలిచ్చారు. దివ్య విద్యుత్ షాక్ కారణంగా మరణించిందని చెప్పారు. తరువాత ఆత్మహత్య  చేసుకున్నదన్నారు. అయితే  పాక్షికంగా కుళ్లిపోయిన ఆమె శరీరాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, మృతురాలి తలపై తుపాకీతో కాల్చిన గాయం ఉందని గుర్తించారు.

అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సురేంద్ర పాల్ సింగ్ దబార్ మీడియాతో మాట్లాడుతూ.. దివ్య మృతదేహాన్ని కున్వారీ నది నుండి వెలికితీసి, పోస్ట్‌మార్టం కోసం పంపామని, ఫోరెన్సిక్ నివేదిక తర్వాత మాత్రమే మరణానికి గల కారణాన్ని నిర్ధారించగలమన్నారు. మృతురాలి తండ్రి భరత్ సికార్వార్ మీడియాతో మాట్లాడుతూ  తీవ్రంగా గాయపడిన తన కుమార్తెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మరణించిందని, దీంతో భయపడి తాను మృతదేహాన్ని నదిలో పారవేశానని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)