Breaking News

‘కోడ్ అదిరింది.. లాజిక్ అడగ్గానే ఫ్యూజులు అవుట్‌’

Published on Sun, 03/08/2026 - 12:51

సాఫ్ట్‌వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం సృష్టిస్తోంది. సంక్లిష్టమైన కోడింగ్‌ను నిమిషాల్లో పూర్తి చేస్తూ, డెవలపర్ల పనిని మరింత సులభతరం చేస్తోంది. అయితే ఇదే ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల తలెత్తుతున్న పరిణామాలు ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను రాసిన (ఏఐ సాయంతో) కోడ్‌ను వివరించలేక తోటి ఉద్యోగుల ముందు అభాసుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో డెవలపర్లు తాము రాసిన కోడ్‌ను రివ్యూ కోసం ‘పుల్ రిక్వెస్ట్’ రూపంలో సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ టెక్ కంపెనీకి చెందిన డెవలపర్ ఒక ఫంక్షన్‌కు సంబంధించిన కోడ్‌ను తన టీమ్ లీడర్‌కు పంపాడు. ఆ కోడ్ అద్భుతంగా పని చేస్తోంది. ఎటువంటి ఎర్రర్స్ లేవు. అయితే ఆ కోడ్ వెనుక ఉన్న లాజిక్‌ను వివరించాల్సిందిగా సీనియర్ ఎడిటర్ కోరడంతో అసలు విషయం బయటపడింది. ఆ డెవలపర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరకు తల దించుకుని తాను ఆ కోడ్‌ను 'క్లాడ్' (Claude) అనే ఏఐ టూల్ నుంచి నేరుగా కాపీ-పేస్ట్ చేశానని తెలిపాడు.

ఈ ఉదంతాన్ని సదరు టీమ్ లీడర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ‘అతనికి కోడింగ్ రాదని కాదు.. కానీ తాను స్వయంగా రాయకపోవడం వల్ల అందులోని లాజిక్‌ను విశ్లేషించలేకపోయాడు. ఏఐ ఇచ్చింది.. పంపేశాడు.. అంతే!’ అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం 50 శాతం కంటే ఎక్కువ పుల్ రిక్వెస్టుల్లో ఏఐ ప్రమేయం ఉంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. స్టాక్ ఓవర్‌ఫ్లో వంటి వెబ్‌సైట్ల నుంచి గతంలో కోడ్ తీసుకునేవారని, కానీ అప్పట్లో కనీసం ఆ కోడ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని సీనియర్లు గుర్తుచేస్తున్నారు.

ఇప్పుడు ఏఐ టూల్స్ నేరుగా పరిష్కారాన్ని అందిస్తుండటంతో, యువ డెవలపర్లు మౌలిక సూత్రాలను (Fundamentals) విస్మరిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. కోడ్ పని చేస్తే చాలు, అది ఎలా ఉన్నదనేది ముఖ్యం కాదు అనే ధోరణి భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్‌లో తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐని ఒక సహాయకారిగా చూడాలే తప్ప, అది ఇచ్చే సమాచారాన్ని కళ్లు మూసుకుని వాడటం వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్‌ స్కాలర్‌ విజయ గాథ

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)