Breaking News

ఉపాధ్యాయ వృత్తికే మచ్చ.. విద్యార్థి తల్లితో సన్నిహితంగా ఉంటూ..

Published on Thu, 12/22/2022 - 08:02

సాక్షి, బెంగళూరు(యశవంతపుర): ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా ఓ అతిథి ఉపాధ్యాయుడు విచక్షణ మరచిపోయాడు.  ఏ తప్పూ ఎరగని విద్యార్థిపై దాడికి పాల్పడి బాలుడి మృతికి కారణమయ్యాడు. ఈ విషాద ఘటన గదగ్‌ జిల్లా నరగుంద తాలూకా హద్లి గ్రామంలో జరిగింది. గదగ్‌ ఎస్పీ శివప్రకాష్‌ దేవరాజు కథనం మేరకు వివరాలు... హద్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ముత్తప్ప అనే వ్యక్తి అతిథి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇదే పాఠశాలలో గీత అనే మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

ఆమె కుమారుడు భరత్‌ ఇదే పాఠశాలలో చదువుతున్నాడు. గీత, ముత్తప్పలు సన్నిహితంగా మెలిగేవారు. ఇటీవల విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లిన సమయంలో గీత మరో ఉపాధ్యాయుడితో చనువుగా మాట్లాడింది. దీంతో ఆమెపై ముత్తప్ప కోపాన్ని పెంచుకున్నాడు. ఈనెల 19న భరత్‌ను బయటకు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గీత ముత్తప్పను నిలదీయగా ఆమెపై కూడా దాడి చేశాడు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా భరత్‌ మంగళవారం మృతి చెందాడు. అతని తల్లి గీత చికిత్స పొందుతోంది. నిందతుడు ముత్తప్పను మంగళవారం అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ముత్తప్ప తీరుతో తమ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు జంకుతున్నారు. 

చదవండి: (అనుమానాస్పద స్థితిలో భార్య.. నిద్రమాత్రలు మింగి భర్త..)

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)