Breaking News

సినిమా తరహా ఘటన.. హంతకుల పేర్లు పచ్చబొట్టు

Published on Fri, 07/26/2024 - 19:18

ముంబై: నగరంలో సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి ఒంటిపై వేయించుకున్న పచ్చబొట్లు హంతకులను పట్టించాయి. ముంబైలోని గురు వాఘ్‌మారే అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటూ వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ క్రమంలో నిజంగానే ఆ వ్యక్తిని స్పా సెంటర్‌లో దుండగులు హత్య చేశారు. 

పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టులో  22 మంది పేర్లను గుర్తించారు. వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్పా యజమాని సంతోష్ షెరేకర్‌తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

యూపీఐ రికార్డులో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. అన్సారీ యూపీఐ ఐడీకి లింకయిన ఫోన్ నంబర్‌కి షెరేకర్‌ పలుమార్లు ఫోన్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో స్పాలోకి ప్రవేశించి, వాఘ్‌మారే గర్ల్‌ ఫ్రెండ్‌ను మరొక గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం కత్తెర, బ్లేడ్‌లను ఉపయోగించి వాఘ్‌మారేను హత్య చేశారు.

వాఘ్‌మారే గర్ల్‌ఫ్రెండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కాగా వాఘ్‌మారే సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూ 2010 నుంచి ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్‌లోని పలువురు స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేసేవాడని, అతనిపై దోపిడీ, అత్యాచారం, వేధింపుల క్రిమినల్ కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)